కోర్టుకు హాజ‌రైన త‌ర్వాత జ‌గ‌న్ ఏం చేశారంటే..?

Update: 2017-11-25 04:16 GMT
అలుపెర‌గ‌ని శ్రామికుడు మాదిరి సుదీర్ఘ పాద‌యాత్ర‌ను చేస్తున్న ఏపీ విప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ఇప్పుడు ప‌లువురి మ‌న‌సును దోచుకుంటున్నారు. ఓప‌క్క పాద‌యాత్ర చేస్తూనే.. మ‌రోప‌క్క ప్ర‌తి వారం కోర్టుకు హాజ‌ర‌య్యే కార్య‌క్ర‌మాన్ని తూచా త‌ప్ప‌కుండా పాటిస్తున్నారు. ప్ర‌తి వారం కోర్టుకు త‌ప్ప‌నిస‌రిగా హాజ‌రు కావాల‌న్న కోర్టు సూచ‌న‌ను పాటిస్తున్న జ‌గ‌న్‌.. కోర్టుకు హాజ‌ర‌య్యాక ఏం చేస్తున్నార‌న్న‌ది ఆస‌క్తిక‌ర అంశంగా చెప్పాలి.

తాజాగా కోర్టుకు హాజ‌రైన జ‌గ‌న్‌.. కోర్టులో త‌న పాత్ర ముగిసిన వెంట‌నే ఆల‌స్యం చేయ‌కుండా తాను ఎక్క‌డ పాద‌యాత్ర నిలిపివేశారో.. అక్క‌డికి హుటాహుటిన వెళ్లి చేరుకుంటున్నారు. పాద‌యాత్ర షెడ్యూల్‌ను ఏ మాత్రం డిస్ట్ర‌బ్ కాకుండా ఆయ‌న శ్ర‌మిస్తున్నారు.

తాజాగా శుక్ర‌వారం విష‌యానికే వ‌స్తే.. కోర్టుకు హాజ‌రైన జ‌గ‌న్ ఆ త‌ర్వాత నేరుగా త‌న పాద‌యాత్ర‌లో త‌దుప‌రి స్థాన‌మైన వెల్దుర్తికి బ‌య‌లుదేరారు. క‌ర్నూలు జిల్లాలోని ఈ ప్రాంతానికి శుక్ర‌వారం జ‌గ‌న్ చేరుకునే స‌రికి రాత్రి అయ్యింది. పొలం ప‌క్క‌నే త‌న బ‌స‌ను ఏర్పాటు చేసుకున్న జ‌గ‌న్‌.. అక్క‌డే విశ్ర‌మించారు. ఆడంబ‌రాల‌కు దూరంగా.. ప్ర‌జ‌ల్లో మ‌మేక‌మ‌వుతున్న జ‌గ‌న్‌.. త‌న బ‌స‌ను ప్ర‌జ‌ల మ‌ధ్య‌లోనే ఏర్పాటు చేసుకుంటున్నారు.

ఉరుకులు ప‌రుగుల మీద కోర్టుకు వెళ్లి.. మ‌ళ్లీ పాద‌యాత్ర‌కు వ‌స్తున్న జ‌గ‌న్ క‌ష్టంపై ప‌లువురు రియాక్ట్ అవుతున్నారు. తీవ్ర ఒత్తిడికి.. శారీర‌క శ్ర‌మ‌కు గురి అవుతున్నా.. మాట వ‌ర‌స‌కు కూడా ఆ విష‌యాన్ని ప్ర‌స్తావించ‌ని వైనం ఇప్పుడు అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తోంది. పొలం ప‌క్క‌న బ‌స చేసిన జ‌గ‌న్‌.. శ‌నివారం ఉద‌యం 8.30 గంట‌ల‌కు వెల్దుర్తి నుంచి త‌న పాద‌యాత్ర‌ను ప్రారంభించ‌నున్నారు. ఈ రోజు జ‌గ‌న్ పాద‌యాత్ర‌ వెల్దుర్తి.. క్రిష్ణ‌గిరి మండ‌లాల్లో సాగ‌నుంది. 
Tags:    

Similar News