పాదయాత్ర...కొందరికి హాస్యాస్పదం. అధికారంలో ఉన్న మరి కొందరికి కంటగింపు. కోట్లాది తెలుగు ప్రజలకు మాత్రం ఓ ఆశ్చర్యం. దేశంలో ఇంత వరకూ ఏ ఒక్క నాయకుడు చేయని - చేయలేని పాదయాత్రను ఆంధ్రప్రదేశ్ లో ప్రతిపక్ష నేత వైఎస్. జగన్ మోహన రెడ్డి చేసారు. ఒకటి కాదు - రెండు కాదు... వంద కాదు - వేయి కాదు ఏకంగా 3000 కిలోమీటర్లు పాదయాత్ర చేసి సరికొత్త రికార్డును నెలకొల్పేరు. ఈ పాదయాత్ర వెనుక కోట్లాది మంది తెలుగు ప్రజల ఆకాంక్షలు ఉన్నాయి. ఆశలు ఉన్నాయి. తమ బతుకులు మారుతాయన్న కలలూ ఉన్నాయి. వైఎస్. జగన్ మోహన రెడ్డి ప్రజాసంకల్ప యాత్రను తన తండ్రి వైఎస్. రాజశేఖర రెడ్డి జన్మించిన కడప నుంచే ప్రారంభించారు. తన తండ్రి పేరిట పార్టీ స్థాపించిన రోజే ఆయన ఆశయాలను నెరవేరుస్తానని బహిరంగ ప్రకటన చేసారు. అందుకనుగుణంగానే ప్రజాసంకలప్ప యాత్రను చేపట్టారు. 2017వ సంవత్సరం నవంబర్ ఆరున ప్రారంభించిన పాదయాత్ర 3000 కిలోమీటర్లు సాగింది. కడపలో ప్రారంభమైన ఈ యాత్ర విజయనగరం జిల్లా శ్రుంగవరపుకోట చేరేసరికి 3000 కిలోమీటర్లు పూర్తి అయింది.
ఎర్రటి ఎండలో నడిచారు.....హోరు వానలో తడుస్తూ నడిచారు. గజగజ వణికే చలిలోనూ పాదయాత్ర చేసారు. నడవడం అంటే అలా నడుచుకుంటూ వెళ్లిపోవడం కాదని ప్రజల కష్టాలను తెలుసుకుంటూ ముందుకు సాగడమేనని జగన్ నిరూపించారు. ఆంధ్రప్రదేశ్ లోని 13 జిల్లాలలో ఉన్న 125 శాసనసభ నియోజకవర్గాలలో జగన్ పాదయాత్ర సాగింది. ప్రతీ జిల్లాలోను అన్నీ నియోజకవర్గాలలోను ప్రజల నుంచి విశేష స్పందన వచ్చింది. ముఖ‌్యంగా రైతులు - యువకులు - మహిళలు ప్రబుత్వ ఉద్యోగుల నుంచి విశేష స్పందన వచ్చింది. తెలుగు ప్రజలంతా తమ ఆశలు తీరతాయని - కలలు ఈడారతాయని భావిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం ప్రభుత్వం తీసుకుంటున్న ప్రజవ్యతిరేక చర్యలపై పాదయాత్ర సందర్భంగా జగన్ కు చెప్పుకున్నారు. "జగన్ రావాలి....మాకు జగన్ కావాలి " అంటూ పాదయాత్రలో ప్రతిధ్వనించే నినాదాలు చేసారు. నిజానికి ప్రజాసంకల్ప యాత్ర ప్రారంభానికి ముందు 180 రోజులు మాత్రమే ఈ యాత్రను కొనసాగించాలనుకున్నారు. అయితే రోజురోజుకు వస్తున్న ప్రజా స్పందనను చూసి యాత్రను పెంచుకుంటూ వెళ్లారు. అదికాస్తా అలాఅలా పది నెలలకు చేరుకుంది. అంతేకాదు 3000 కిలోమీటర్ల మైలు రాయిని దాటింది. ఈ పాదయాత్రతో జగన్ లో రాజకీయ పరిణితి పెరిగిందని - ప్రజల కష్టాలు - బాధలు దగ్గర నుంచి చూసే అవకాశం వచ్చిందని రాజకీయ పరిశీలకులు అంటున్నారు.