3వేల మార్క్‌ ను దాట‌నున్న జ‌గ‌న్ పాద‌యాత్ర‌

Update: 2018-09-20 12:11 GMT
ఒక‌సారి ఫిక్స్ అయితే.. ఎంత క‌ష్ట‌మైనా వెన‌క్కి త‌గ్గేది లేద‌న్న విష‌యాన్ని చేత‌ల్లో చూపించిన అధినేత‌గా ఏపీ విప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిని చెప్పాలి. ఆయ‌న చేప‌ట్టిన ప్ర‌జా సంక‌ల్ప యాత్రలో మ‌రో రికార్డు న‌మోదు కానుంది. నెల‌ల త‌ర‌బ‌డి ఇంటికి దూరంగా.. రోడ్ల మీద‌నే న‌డుస్తున్న ఆయ‌న పాద‌యాత్ర మ‌రో మైలురాయికి చేరుకోనుంది.

ఈ నెల 24న జ‌గ‌న్ పాద‌యాత్ర 3వేల కిలోమీట‌ర్ల మార్క్ ను ట‌చ్ చేయ‌నుంది. విజ‌య‌న‌గ‌రం జిల్లా కొత్త వ‌ల‌స ద‌గ్గ‌ర్లోని దేశ‌పాత్రునిపాలెం వ‌ద్ద 3వేల కి.మీ. మైలురాయికి చేర‌నున్న‌ట్లుగా చెబుతున్నారు. ఈ సంద‌ర్భంగా భారీ బహింర‌గ స‌భ‌ను ఏర్పాటు చేయాల‌న్న ఆలోచ‌న‌లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత‌లు ఉన్న‌ట్లుగా తెలుస్తోంది. భారీ స‌భ‌తో పాటు.. ప్ర‌త్యేక ఫైలాన్ ను ఆవిష్క‌రించ‌నున్న‌ట్లుగా పార్టీ రాష్ట్ర కార్య‌ద‌ర్శి త‌ల‌శిల ర‌ఘురాం వెల్ల‌డించారు.

వైఎస్ జ‌గ‌న్ పాద‌యాత్ర ముందుకు సాగ‌కుండా ఉండేందుకు ప‌లు ప్ర‌య‌త్నాలు చేసిన ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు ఎత్తులు పార‌లేదు. ప్ర‌జాభిమానం వెల్లువెత్తుతున్న వేళ‌.. బాబు కుయుక్తులు చిత్తు అయిన ప‌రిస్థితి. పాద‌యాత్ర సాగుతున్న కొద్దీ.. జ‌గ‌న్ మీద ప్రజాభిమానం అంత‌కంత‌కూ పెరిగిన ప‌రిస్థితి.

ఇదిలా ఉంటే..జ‌గ‌న్ పాద‌యాత్ర 3 వేల కిలోమీట‌ర్ల చారిత్ర‌క మార్క్ ను ట‌చ్ చేస్తున్న వేళ‌.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత‌లు.. పార్టీ కార్య‌క‌ర్త‌లు ఉత్సాహంతో ఉరుకులు ప‌రుగులు తీస్తున్నారు. పాద‌యాత్ర‌కు వ‌స్తున్న  స్పంద‌న నేప‌థ్యంలో వ‌చ్చే ఎన్నిక‌ల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విజ‌యం ఖాయ‌మంటున్నారు.

గ‌తంలో బాబు పాల‌న‌ను వైఎస్ ఎలా అయితే అంత‌మొందించారో.. ఇప్పుడు కూడా జ‌గ‌న్ అదే రీతిలో వ్య‌వ‌హ‌రిస్తార‌ని చెబుతున్నారు. త‌న పాద‌యాత్ర‌లో భాగంగా జ‌గ‌న్ ఇప్ప‌టివ‌ర‌కూ 116 నియోజ‌క‌వ‌ర్గాల్లోని 193 మండ‌లాల్లో.. 1650 గ్రామాల మీదుగా న‌డిచారు. తన న‌డ‌క‌లో భాగంగా ఇప్ప‌టివ‌ర‌కూ 106 స‌భ‌లు.. 41 భేటీలు నిర్వ‌హించారు. 269 రోజున జ‌గ‌న్ పాద‌యాత్ర మూడు వేల కిలోమీట‌ర్ల మార్క్ ను చేరుకుంటుంద‌ని చెబుతున్నారు. ఇదే ఉత్సాహంతో జ‌గ‌న్ త‌న పాద‌యాత్ర‌ను విజ‌య‌వంతంగా ముగిద్దామ‌ని కోరుకుందాం.
Tags:    

Similar News