మోడీతో జగన్ ఏం మాట్లాడబోతున్నారంటే..

Update: 2017-05-10 07:01 GMT
వైసీపీ అధినేత జగన్ ఢిల్లీ విమానాశ్రయంలో ల్యాండ్ అయ్యారు. కాసేపట్లో ప్రధాని నరేంద్ర మోడీతో ఆయన భేటీ కానున్నారు. ఈ సందర్భంగా ఏపీకి సంబంధించిన కొన్ని అంశాలపై మోదీతో ఆయన చర్చించనున్నారు. చాలాకాలం తరువాత ప్రధానిని ఆయన కలుసుకోనుండడంతో జగన్ పర్యటనపై రాజకీయంగా ఆసక్తి ఏర్పడింది. ఆయన మోడీతో ఏం మాట్లాడనున్నారు.. ఏపీ ప్రభుత్వంపై ఏమైనా ఫిర్యాదులు చేస్తారా అన్నది చర్చనీయంగా మారింది.
    
ముఖ్యంగా మిర్చి రైతుల సమస్యలు, రాష్ట్రానికి ప్రత్యేక హోదా, రైల్వే జోన్ వంటి అంశాలను జనగ్ మోడీ దృష్టికి తీసుకువెళ్లనున్నట్లు తెలుస్తోంది.  దీనికితోడు పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలను ఏపీ కేబినెట్లోకి తీసుకోవడంపై ఫిర్యాదు చేయనున్నట్టు తెలుస్తోంది. విభజన సమస్యల గురించి కూడా మోదీకి జగన్ వివరించే అవకాశం ఉంది.
    
కాగా ప్రధానిని  కలిసేందుకు గత కొంత కాలంగా జగన్ ప్రయత్నిస్తున్నారు. ఇటీవల జరిగిన పార్లమెంటు సమావేశాల సందర్భంగా కూడా ప్రధానిని కలిసేందుకు జగన్ అపాయింట్ మెంట్ కోరారు. అయితే, పార్లమెంటులో అనేక బిల్లులు ఆమోదం పొందాల్సి ఉండటంతో...  జగన్ కు మోదీ అపాయింట్ మెంట్ లభించలేదు. ఇప్పుడు ప్రధాని అపాయింట్ మెంట్ ఇవ్వడంతో జగన్ హుటాహుటిన ఢిల్లీ వెళ్లారు.
Tags:    

Similar News