ఆంధ్రాలో పార్టీ పెట్టడంపై క్లారిటీ ఇచ్చిన షర్మిల

Update: 2022-01-07 13:32 GMT
ఏపీలో ప్రస్తుతం వైఎస్ జగన్ అధికారంలో ఉన్నారు. ఆయన చెల్లి వైఎస్ షర్మిల మాత్రం తెలంగాణలో రాజకీయం చేస్తోంది. అయితే షర్మిల పుట్టిన ఏపీలో ఎందుకు పార్టీ పెట్టడం లేదనే ప్రశ్నలు తరచూ వినిపిస్తున్నాయి. అక్కడ అన్నయ్య జగన్ అధికారంలో ఉన్నారని... ఆయనకు పోటీగా షర్మిల పార్టీ పెట్టడం ఇష్టం లేకనే తెలంగాణ వైపు చూస్తున్నారని రాజకీయవర్గాల్లో ఎప్పటి నుంచో ప్రచారం ఉంది.

ఆంధ్రప్రదేశ్ లో పార్టీ పెట్టడంపై వైఎస్ఆర్ టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల స్పందించారు. రాజకీయ పార్టీ ఎక్కడైనా ఎప్పుడైనా పెట్టొచ్చని అన్నారు. పార్టీ పెట్టకూడదని ఏం లేదు కదా? అని ప్రశ్నించారు.

నా బతుకు ఇక్కడే ముడిపడి ఉందని.. వైఎస్ఆర్ ను ప్రేమించిన ఈ ప్రజలకు సేవ చేయడానికే వైఎస్ఆర్ టీపీ పుట్టిందని షర్మిల తెలంగాణపై ప్రేమను చాటుకున్నారు. రాజకీయాల్లో ఏదైనా జరగొచ్చు. ఎప్పుడూ అధికారంలో ఉంటాను అనుకోవడం మూర్ఖత్వం.. అధికారంలో లేనివారు.. అధికారంలోకి రారనుకోకూడదు అని షర్మిల చెప్పారు.

దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి కూతురు షర్మిల  కొత్త పార్టీతో ప్రజలను తమ వైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. నిరుద్యోగులకు అన్యాయం జరిగిందనే నినాదంతో దీక్షలు చేపడుతున్నారు. అయితే షర్మిలకు వ్యక్తిగతంగా రాజకీయ అనుభవం లేకున్నా.. ఆమె రాజకీయ కుటుంబ నుంచి వచ్చింది. దీంతో రాజన్న రాజ్యం అనే సెంటిమెంట్ తో జిల్లాల పర్యటనలు చేస్తున్నారు. జాతీయ, ప్రాంతీయ పార్టీల మధ్య పోరు తీవ్రం ఉన్న సమయంలో షర్మిల పార్టీని ఎంత మంది ఆదరిస్తారు అనేది చర్చనీయాంశంగా మారింది. ఒకవేళ షర్మిల పార్టీ కొన్ని సీట్లు గెలుచుకున్నా అధికార పార్టీకి మద్దతు ఇచ్చే అవకాశం ఉంటుందని అనుకుంటున్నారు.
Tags:    

Similar News