షర్మిల పరిస్ధితి ఇలాగైపోయిందేంటి .

Update: 2021-08-21 05:00 GMT
అన్న జగన్మోహన్ రెడ్డి ఏపిలో అధికారంలోకి వచ్చేసినట్లే తాను తెలంగాణాలో కూడా అధికారంలోకి వచ్చేయాలని చెల్లెమ్మ షర్మిల పార్టీ పెట్టారు. దానికి వైఎస్సటీర్టీపీ అని పేరు కూడా పెట్టారు. రాబోయే ఎన్నికల్లో వైఎస్సార్టీపీ ఏదో చేసేస్తుందని జనాలు అనుకుంటుంటే ఇపుడు ఇందో అయిపోతోంది. పార్టీలో నుండి తాజాగా ఇందిరా శోభన్ అనే సీనియర్ నేత, అధికారప్రతినిధి రాజీనామా చేశారు. గతంలోనే ఇద్దరు సీనియర్ నేతలు రాజీనామా చేసిన విషయం తెలిసిందే.

గతంలో రాజీనామాల విషయాన్ని పక్కనపెట్టేసినా ఇపుడు ఇందిర రాజీనామా విషయంపైన మాత్రం పెద్ద చర్చే జరుగుతోంది. ఇందిరా శోభన్ ఒకపుడు కాంగ్రెస్ పార్టీలో బాగా చురుగ్గా ఉండేవారు. కాంగ్రెస్ అధికారప్రతినిధి హోదాలో టీవీ చర్చల్లో బాగా చురుగ్గా పాల్గొనేవారు. కాబట్టి ఇందిర అంటే చాలామంది వెంటనే గుర్తుపడతారు. అలాంటి నేత షర్మిల పార్టీలో చేరగానే మంచి ఊపువస్తుందని అనుకున్నారు. అయితే వైఎస్సార్టీపీలో చేరిన కొద్ది కాలానికే ఇందిర రాజీనామా చేయటం షర్మిలకు పెద్ద దెబ్బనే చెప్పాలి.

షర్మిల పార్టీలో నుండి బయటకు వచ్చేసేవాళ్ళే కానీ కొత్తగా చేరేవాళ్ళే కనబడటంలేదు. రాష్ట్రమంతా తెలిసిన నేతలు షర్మిల పార్టీలో ఎవరు లేరంటే ఆశ్చర్యంలేదు. రాజీనామాలతో వైఎస్సార్టీపీలో ఏమి జరుగుతోందో కూడాఎవరికీ అర్ధంకావటంలేదు. నేతల రాజీనామాల దెబ్బకు అసలు షర్మిల పార్టీ వచ్చే ఎన్నికల దాకా అయినా ఉనికిలో ఉంటుందా అనే డౌట్లు పెరిగిపోతోంది. ఇప్పటికే తెలంగాణాలో ఫైట్ ప్రధానంగా మూడు పార్టీల మధ్య జరుగుతోంది.

అధికార టీఆర్ఎస్ పైకి ప్రతిపక్షాలు కాంగ్రెస్, బీజేపీలు పదే పదే ఆరోపణలు, విమర్శలతో రెచ్చిపోతున్నాయి. కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఒకవైపు బీజేపీ చీఫ్ బండి సంజయ్ మరోవైపు కేసీయార్ కుటుంబం+టీఆర్ఎస్ నేతలను టార్గెట్ చేస్తు రెచ్చిపోతున్నారు. దీనికితోడు హుజూరాబాద్ అసెంబ్లీ ఉఎన్నికల వేడి కూడా తోడవ్వటంతో ఒక్కసారిగా రాజకీయ వేడి పెరిగిపోయింది. వీళ్ళ మధ్యలో షర్మిలను పట్టించుచుంటున్న జనాలే కనబడటంలేదు. ఈ నేపధ్యంలోనే నేతల రాజీనామాపై షర్మిల పార్టీ ఇలాగైపోయిందేంటనే చర్చ పెరిగిపోతోంది.


Tags:    

Similar News