ఏపీ సీఎం జగన్ చిన్నాన్న, మాజీ మంత్రి, దివంగత వైఎస్ వివేకానందరెడ్డి హత్య .. ఇప్పుడు రాజకీయ విన్యాసాలకు వేదికగా మారిపోయిందా? అధికార , ప్రతిపక్షాల మధ్య తీవ్ర వివాదాలు.. వ్యాఖ్యల యుద్ధాలకు దారితీసిందా? అంటే.. ఔననే అంటున్నారు పరిశీలకులు. అసలు వివేకా హత్య వెనుక ఎవరున్నారు? ఎందుకు ఆయనను చంపారు? అనే విషయాలు తేలాలని.. గడిచిన మూడేళ్లుగా(2019-22) రాష్ట్ర ప్రజలే కాకుండా.. రాజకీయ పార్టీల నేతలు కూడా ఎదురు చూస్తున్నారు. కానీ, ఈ విషయాన్ని పక్కన పెట్టేసి.. కేవలం దీనిని రాజకీయ చర్చగాను.. రచ్చగాను మార్చేయడం గమనార్హం.
నిజానికి దివంగత సీఎం, వైఎస్ రాజశే్ఖరరెడ్డి మరణం తర్వాత.. జరిగిన పరిణామాలతో వైఎస్ కుటుంబంలో ఎన్నో గొడవలు జరిగాయని అంటారు. ఇదే 2014 ఎన్నికల్లో వైఎస్ జగన్ ఎంత ప్రయత్నించినా.. అధికారంలోకి రాకుండా చేసిందనే వాదన కూడా వైసీపీలో ఉంది. ఆయన అప్పటి ఎన్నికల్లో అధికారంలోకి రాకపోవడం తర్వాత.. ఏపీలో అందరూ ముఖ్యంగా వైఎస్ ఫ్యాన్స్ రియలైజ్ అయి.. జగన్‌ను గలిపించుకోవాలని.. నిర్ణయించారు. మరీ ముఖ్యంగా మారుమూల గ్రామాల్లో ఉన్నవారి నుంచి పట్టణాలు, నగరాల్లో ఉన్నవారి వరకు ప్రతి ఒక్కరూ.. ఒక్కసారి జగన్‌కు ఛాన్స్ ఇవ్వాలని.. గెలిపించుకోవాలని.. అందరూ కంకణం కట్టుకుని పనిచేశారు.
దీంతో 2019లో జగన్ అధికారంలోకి వచ్చారు. అది కూడా బంపర్ మెజారిటీ 151 సీట్లతో అధికారం దక్కించుకున్నారు. అయితే.. మధ్యలో రాజకీయ వ్యూహకర్త.. ప్రశాంత్ కిశోర్(పీకే) బృందానికే ఈ క్రెడిట్ వెళ్లిపోయింది. కేడర్ కూడా తీవ్రంగా మధన పడ్డారు. పార్టీ కోసం.. సీఎంగా జగన్ ను చూడాలని అనుకుని.. ఆయన కోసం.. తాము క్షేత్రస్థాయిలో చెమటోడ్చామని.. కానీ, ఇప్పుడు క్రెడిట్ మొత్తం పీకేకే కట్టబెట్టేశారని..వారు ఆవేదన వ్యక్తం చేశారు. నిజానికి ఈ చర్చ వేరేదే అయినప్పటికీ.. సందర్భం వచ్చింది కనుక .. చెప్పాల్సి వస్తోంది.
ఇక, 2019 ఎన్నికలకు ముందు వైసీపీకి కొన్ని పరిణామాలు కలిసి వచ్చాయని అంటున్నారు పరిశీలకులు. ఎన్నికలకు ముందు పాదయాత్రలో ఉన్న జగన్.. విశాఖ పట్నంనుంచి హైదరాబాద్ వచ్చేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో పార్టీ అభిమాని నుంచే చేదు అనుభవం ఎదురైంది. కోడికత్తి ద్వారా.. జగన్‌ను ఆ అభిమాని.. గాయపరిచాడు. అనంతరం.. ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా.. ప్రచారం ఉదృతంగా సాగుతున్న సమయంలో జగన్ చిన్నాన్న వైఎస్ వివేకానందరెడ్డి హత్యకు గురయ్యారు. అయితే.. ఈ మర్డర్ విషయంలో వైసీపీ హైకమాండ్‌తొలుత గుండెపోటు అని ప్రచారం చేసింది. సొంత మీడియాలో దీనినే ఊదర గొట్టారు. ఇక, సొంత పేపర్‌లో మరో విదంగా రాశారు.
ఇక, ఏదేమైనా.. తర్వాత పరిణామాల్లో వివేకా.. హత్యకు గురయ్యారని తెలిసిన తర్వాత.. ఈ కేసుపై అప్పటి సీఎం చంద్రబాబు సిట్‌లను ఏర్పాటు చేశారు. అయితే.. దీనిని కాదన్న.. జగన్.. తనకు రాష్ట్ర పోలీసులపై నమ్మకం లేదని.. పేర్కొంటూ.. సీబీఐకి ఇవ్వాలని డిమాండ్ చేశారు. అంతేకాదు.. ఈ హత్య వెనుక టీడీపీ వాళ్లే ఉన్నారని.. అనుమానాలు వ్యక్తం చేశారు.మరోవైపు.. వివేకా కుమార్తె.. సునీత కూడా ముందు టీడీపీ వాళ్ల మీద అనుమానాలు వ్యక్తం చేశారు. ఇదిలావుంటే.. ఈ పరిణామాలు తేలకుండానే.. వైసీపీ ప్రభుత్వం వచ్చేసింది. దీంతో తనకు న్యాయం జరుగుతుందని సునీ త భావించారు. అయితే.. అప్పటి వరకు సీబీఐని అడిగిన జగన్.. తర్వాత మరో సిట్ వేసి చేతులు దులుపుకొన్నారు.
దీంతో తమను న్యాయం జరగకపోతే.. ఏదో తొక్కేసే ప్రయత్నం చేస్తున్నారన్న అనుమానతంతో సీబీఐ దర్యాప్తు కోరుతూ.. వివేకా సతీమణి సౌభాగ్యమ్మ హైకోర్టుకు వెళ్లారు. హైకోర్టు ఆదేశాల మేరకు సీబీఐ రంగంలోకి దిగింది. దీంతో అనుమానితులను విచారించడం యుద్ధ ప్రాతిపదికన ప్రారంభించారు. కరోనా నేపథ్యంలో కొన్నాళ్లు ఆలస్యమైనప్పటికీ.. ఇటీవల కాలంలో మరింత వేగం పుంజుకుంది. అనుమానితుల నుంచే కాకుండా.. సాక్షుల నుంచి వివేకా కుటుంబ సభ్యుల నుంచి కూడా సీబీఐ వాంగ్మూలం నమోదు చేసింది. దీనిపై సీబీఐ ఇంకా ఫైనల్ చేయలేదు. ఇక, ఈ క్రమంలో బాధితులుగా ఉన్న వివేకా కుమార్తె, అల్లుడు ఇచ్చిన వాంగ్మూలంలో కొన్ని ఆరోపణలు చేశారు. ఇదిలావుంటే.. వైసీపీ అధికారిక పత్రిక ముందు టీడీపీ హస్తం ఉందని పేర్కొంది.
ఏకంగా `నారాసుర రక్త చరిత్ర` అంటూ.. పెద్ద కథనాలే రాసింది. తర్వాత.. ఇప్పుడు యూటర్న్ తీసుకుని.. ఏకంగా వివేకా అల్లుడి పాత్ర ఉందేమో! అనేలా కథనాలు వండివారుస్తోంది. అంటే వివేకా కుమార్తె భర్తనే టార్గెట్ చేసినట్టు కనిపిస్తోంది. మరోవైపు సునీత మాత్రం ఎంపీ అవినాష్‌పైనా, ఆయన తండ్రి భాస్కరరెడ్డిపైనా అనుమానాలు ఉన్నాయని చెప్పారు. ఆమె అదే వాంగ్మూలంగా కూడా సీబీఐకి చెప్పారు. అయితే.. గత వారం నుంచి దీనిపైనే మీడియాలో పెద్ద ఎత్తున చర్చలు సాగుతున్నాయి. నిన్న మొన్నటి వరకు తటస్థంగా ఉన్న కొన్నివర్గాలు కూడా ఇప్పుడు రెండుగా చీలిపోయి కనిపిస్తున్నాయి.
ఇదిలావుంటే.. అసలు ఈ కేసులో ప్రజలకు తెలియాల్సింది.. వివేకాను ఎవరు హత్య చేశారు? ఎందుకు చేశారు? దీనివెనుక వారికి లాభం ఏంటి? అసలు మొత్తం కథ నడిపించింది ఎవరు? అనే సంచలన విషయాలే తప్ప.. ఆరోపణలు మాత్రం కాదు!. ఇప్పుడు జరుగుతున్న చర్చలో ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నట్టు ఎంపీ అవినాష్ రెడ్డి చంపించారా? లేక వివేకాను ఆయన అల్లుడే ప్రాణాలు తీయించారా? అనేది సీబీఐ తేలుస్తుంది. సీబీఐ రిపోర్టు ఇచ్చిన తర్వాత.. దీనిపై కోర్టుకు వెళ్లే అవకాశం కూడా ఉంది. కానీ, వైసీపీ, టీడీపీ అనుకూల మీడియా మాత్రం అతి చేస్తూ.. దీనికి `కారణం మీరే అంటే.. కాదు మీరే` అంటూ.. వాదన ఎందుకు? విమర్శలెందుకు? రచ్చ ఎందుకు? అనేది ప్రశ్న. అంతేకాదు.. ఇదే విషయంపై సోషల్ మీడియాలో పోస్టులు ఎందుకు పెట్టుకుంటున్నారు? అనేది కూడా ప్రధాన చర్చగా మారింది. ఈ క్రమంలో వైసీపీ సోషల్ మీడియా అవినాష్ రెడ్డిని వెనుకేసుకు రావడం అనేది కొందరికి అనుమానాలను రేకేత్తిస్తుండడం గమనార్హం.
అదేవిధంగా టీడీపీ వాళ్లకు కూడా వివేకా అల్లుడు నర్రెడ్డి రాజశేఖర్‌రెడ్డిని వెనుకేసుకు రావడం ఎందుకు? అనే మాట వినిపిస్తోంది. అసలు ఏం జరుగుతుంది? ప్రజలకుతెలియాల్సింది ఏంటి? అనేవి చూస్తే.. వివేకాను ఎవరు అంత దారుణంగా హత్య చేశారు? దీనికి బాధ్యులు ఎవరు? అనేవి తెలియాలి. అదేవిధంగా వాళ్లకు ఎలాంటి శిక్షలు పడతాయో తెలియాలి. అంతేకానీ.. ఈ రచ్చ మాత్రం కాదు. వైసీపీ హైకమాండ్ ఎఎందుకు హడావుడి చేసి .. వైఎస్ సునీత మీద ఆరోపణలు చేస్తోంది? అనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. మరీ ముఖ్యంగా ఆమెను టీడీపీకి అంటగట్టి.. వ్యాఖ్యలు చేయడం.. అది కూడా సీనియర్ నాయకుడు.. సలహాదారు సజ్జల వ్యాఖ్యానించడం.. సబబుగా లేదనే వాదన వినిపిస్తోంది.
ఈ క్రమంలో ఆమెను వైఎస్ కుటుంబానికి దూరం చేయాలనే ఆలోచన చేస్తున్నట్టు కనిపిస్తోందని ప్రజలకు కూడా అనుమానాలు వస్తున్నాయి. ఇక, ఇది వైఎస్ కుటుంబం విషయం. సీబీఐ వాళ్లు తేలుస్తారు. కానీ, మధ్యలో టీడీపీకి ఎందుకు? అనేది కూడా చర్చగా మారింది. ఏది పడితే అది మాట్లాడి.. కేసును వైసీపీ , టీడీపీలు నీరు గారుస్తున్నాయనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇలాంటి ప్రయత్నాలు మానుకోవాలని.. ప్రజలే కోరుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఈ ఘటన వెనుక కారకులు.. ఎందుకు చేశారు? అనేది సీబీఐ త్వరలోనే తేలుస్తుందని.. అప్పుడు.. ఎవరి రాజకీయ భవిష్యత్తు పోతుందో.. చూడాలని అంటున్నారు.