నంద్యాల ఎంపీ ఎస్ పీవై రెడ్డి వ్యవహారం మరోసారి తెరమీదకు వస్తోంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన గుర్తుపై నంద్యాలనుంచి గెలిచిన ఎస్ పీవైరెడ్డి.. గెలిచి కనీసం ప్రమాణ స్వీకారం కూడ చేయక ముందే .. పసుపు కండువా కప్పుకున్నారు. వైకాపాను వీడి, తెలుగుదేశం పంచన చేరిపోయారు. పార్టీ ఫిరాయింపుల చట్టం కింద ఆయనపై చర్య తీసుకోవడానికి వైకాపా చాలా రకాలుగా ప్రయత్నించింది కానీ.. ఫలితం దక్కలేదు. ఆయన ఫిరాయించిన నాటికి.. అసలు ఆ పార్టీకే పూర్తి స్థాయిలో ఎన్నికల సంఘం గుర్తింపు లభించి ఉండకపోవడంతో.. ఫిరాయింపు చట్టం అవకాశం లేకుండాపోయినట్లయింది.
దీంతో వైకాపా పాపం.. ఎస్ పీవై మీద చర్య తీసుకోవడానికి రాచమార్గంలో ఏమీ చేయలేక.. డొంకమార్గాన్ని ఎంచుకున్నట్లుగా కనిపిస్తోంది. ఎస్ పీవై రెడ్డి తెలుగుదేశంలో చేరిపోయిన విషయాన్ని స్పీకరుకు ఫిర్యాదు చేస్తే ఫలితం కనిపించలేదు. రాజ్యాంపరంగా ఫలితం వచ్చే అవకాశం కూడా కనిపించలేదు. అందుకే ఇప్పుడు వైకాపా ఫ్లోర్ లీడరు మేకపాటి రాజమోహనరెడ్డి ఇప్పుడు ఆ అంశాన్ని పార్లమెంటు నైతిక విలువల కమిటీకి నివేదిస్తున్నారు. స్పీకరు ఆదేశాల మేరకు జరిగిన నైతిక విలువల కమిటీ సమావేశానికి మేకపాటి హాజరై... ఎస్ పీవై పై చర్యలుండాలని కోరారు గానీ.. అనారోగ్యంగా ఉన్నదంటూ ఎస్ పీవై హాజరు కాలేదు.
నంద్యాలనుంచి అంతకుముందు కూడా కాంగ్రెస్ ఎంపీగానే ఉన్న ఎస్ పీవై రెడ్డి.. ఎన్నికల ముందు వైకాపాలో చేరి మళ్లీ గెలిచారు. తొలినుంచి పార్టీలో అసహనంగానే ఉన్న ఆయన ఎక్కువ కాలం ఇమడలేకపోయారు. ఎవరి మీద విమర్శలు చేయకుండానే.. తెలుగుదేశంలోకి వెళ్లిపోయారు. దాని తరువాత... వైకాపా వారు ఆయనను విమర్శించే ప్రయత్నం చేసినప్పుడు.. కావాలంటే నా సభ్యత్వాన్ని రద్దు చేయించండి.. మళ్లీ పోటీచేసి.. ఇంతకంటె ఎక్కువ మెజారిటీతో గెలుస్తా.. అంటూ సవాలు చేసి ఊరుకున్నారే తప్ప.. ఆయన వైకాపా వారిపై ప్రతివిమర్శలు చేయడం వంటి సున్నం పెట్టుకోలేదు. మొత్తానికి ఆ విషయం నైతికవిలువల కమిటీకి వెళ్లిన తర్వాత.. ఇప్పట్లో ఓ కొలిక్కి వచ్చేలా కూడా లేదు.