మహిళతో న్యూడ్ వీడియో కాల్ మాట్లాడుతూ దొరికిపోయారంటూ హిందూపురం వైఎస్సార్సీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ పై మీడియాలో కథనాలు వస్తున్నాయి. మరోవైపు ప్రతిపక్ష నేతలు, వైఎస్సార్సీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు వంటి వారి మాధవ్ తీరును ఏకిపడేస్తున్నారు. నెటిజన్లు సైతం ఎంపీ మాధవ్ తీరును తప్పుబడుతున్నారు. గతంలోనే అంటే మాధవ్ సీఐగా ఉన్నప్పుడే ఆయనపై అత్యాచారం, లైంగిక వేధింపులు, హత్య కేసులు నమోదయ్యాయని అయ్యాయని గుర్తు చేస్తున్నారు.
కాగా వైఎస్సార్సీపీలో గోరంట్ల మాధవ్ మరో పృథ్వీరాజేనా అనే చర్చ సోషల్ మీడియాలో నడుస్తోంది. సినీ నటుడు, వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రచార కార్యదర్శిగా ఉన్న పృథ్వీరాజ్ వైఎస్సార్సీపీ అధికారంలోకి రాగానే శ్రీ వేంకటేశ్వర భక్తి చానెల్ చైర్మన్ గా పదవిని దక్కించుకున్నారు. అయితే తనతో గడిపితే ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ ఒక మహిళతో మాట్లాడుతూ మాధవ్ లానే అడ్డంగానే దొరికిపోయారు.
దీంతో పృథ్వీరాజ్ పదవి ఊడిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత పృథ్వీరాజ్ ను పట్టించుకున్నవారు వైఎస్సార్సీపీ లేకుండా పోయారు. దీంతో అడపదడపా మీడియా చానెళ్లకు, యూట్యూబ్ చానెళ్లకు ఇంటర్వ్యూలు ఇస్తూ జగన్ ప్రభుత్వంపై విమర్శలు దాడి చేస్తున్నారు.
పృథ్వీరాజ్ టీడీపీ/జనసేనలకు మద్దతుగా మాట్లాడుతున్నారు. ఆ రెండు పార్టీల్లో ఏదో ఒక దానిలో చేరే ఉద్దేశంతో ఉన్నారు. ఇప్పుడు దాదాపు గోరంట్ల మాధవ్ పరిస్థితిని పృథ్వీరాజ్ తో పోలుస్తున్నారు. మాధవ్ పరిస్థితి కూడా రానున్న రోజుల్లో పృథ్వీరాజ్ మాదిరిగా అయినా ఆశ్చర్యపోనవసరం లేదని అంటున్నారు.
ఎందుకంటే గోరంట్ల మాధవ్ కు కూడా ఎలాంటి రాజకీయ నేపథ్యం లేదు. సీఐగా ఉండేవారు. పోలీసుల సంఘానికి అధ్యక్షుడిగా ఉంటూ జేసీ దివాకర్ రెడ్డి పోలీసులపై చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇవ్వడం ద్వారా గోరంట్ల మాధవ్ వార్తల్లోకి వచ్చారు. ఆ దెబ్బతో ఎకాయెకి వైఎస్సార్సీపీ అధినేత జగన్ దృష్టిలో పడటం.. ఎంపీ సీటు దక్కించుకోవడం జరిగిపోయాయి.
ఇక ఇప్పుడు మహిళతో న్యూడ్ వీడియో కాల్ మాట్లాడుతూ అడ్డంగా దొరికిపోవడంతో ఇక ఆయనకు కష్టాలేనని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరో పృథ్వీరాజుగా మారినా ఆశ్చర్యపోనవసరం లేదని అంటున్నారు.