ఏపీ అధికార పార్టీ వైసీపీ వచ్చే ఎన్నికలకు సంబంధించి చేస్తున్న వ్యాఖ్యలు.. ఆ పార్టీలోని బేల తనాన్ని... ఓడిపోవడం ఖాయమనే వాదనను స్పష్టం చేస్తున్నాయని అంటున్నారు పరిశీలకులు. రాష్ట్రంలో ప్రతిపక్షాలు కలిసి పోటీ చేస్తే.. తమ పుట్టి మునిగిపోతుందని.. ఓటమి తథ్యమని.. అంచనాలు వేసుకున్న వైసీపీ అధిష్టానం.. ఆయా పార్టీలు కలవకుండా.. చాలా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోందని చెబుతున్నారు. ఎక్కడ ఆపార్టీలు కలిసిపోతాయో.. తాము ఎక్కడ భారీగా కోల్పోతామో.. అని వైసీపీ అధిష్టానం కలవరపడుతున్నట్టు స్పష్టంగా కనిపిస్తోందని అంటున్నారు.
ఏపీలో వచ్చే 2024 ఎన్నికల్లో టీడీపీ-జనసేన కుదిరితే బీజేపీ కలిసి సంయుక్తంగా ఎన్నికలకు వెళ్లే అవకా శం ఉందనే చర్చ గత కొన్నాళ్లుగా వినిపిస్తోంది. అంటే.. 2014 సీన్ ఏపీలో రిపీట్ అయ్యే అవకాశం ఉంది. ఇదే జరిగితే.. ఆ మూడు పార్టీలు కలిస్తే.. 2014లో ఏ విధంగా అయితే.. వైసీపీ బొక్కబోర్లా పడిందో ఇప్పుడు కూడా అదే పరిస్థితి ఏర్పడుతుందని... వైసీపీ అధిష్టానమే అంచనావేసింది. అందుకే.. ఆమూడు పార్టీలను కలవకుండా చేసేందుకు వ్యూహాత్మకంగా వ్యాఖ్యాలు చేస్తూ.. రెచ్చగొడుతోందని పరిశీలకులు చెబుతున్నారు.
``దమ్ముంటే ఒంటరిగా పోటీ చేయాలి`` అంటూ..తరచుగా మంత్రులు.. నాయకులు చెబుతున్నారు. అంటే.. దీనిని బట్టి ఆ పార్టీలు కలిసి పోటీ చేస్తే.. ప్రభుత్వ వ్యతిరేక ఓటుకు తోడు సంయుక్త ఓటు కలిసి భారీగా సీట్లు కోల్పోయే ప్రమాదం ఉందని వారు ఒక నిర్ణయానికి వచ్చేశారనే అభిప్రాయం విశ్లేషకులు వ్యక్తంచేస్తున్నారు. నిజానికి.. ఏపీ ప్రభుత్వం అనేక మేళ్లు చేస్తోందని.. అనేక సంక్షే మ పథకాలు అమలు చేస్తోందని.. ప్రజలు కూడా తమ వెంటే ఉన్నారని.. నాయకులు పదే పదే చెబుతున్నారు. అంతేకాదు.. నవరత్నాలు అమలు చేస్తున్నామని.. ఇవి ప్రజలజీవితాలను కూడా మారుస్తున్నాయని అంటున్నారు. మరి అలాంటప్పుడు.. ఇంత భయం ఎందుకు? అనేది ప్రశ్న.
నిజానికి తాము చేస్తున్న సంక్షేమానికి ప్రజలు నిజంగానే ఫిదా అవుతున్నారని అనుకుంటే.. తమ నవరత్నాలకు ప్రజల నుంచి మంచి ఆదరణ ఉందనిభావిస్తే.. అంతకుమించి.. ప్రజలు జగన్ వెంట.. ఆయన ప్రభుత్వం వెంట ఉన్నారని లెక్కలు వేసుకుంటే.. వైసీపీ నాయకులు ఎంత ధైర్యంతో ఉండాలి.? ఎలా వ్యవహరించాలి?.. ``ఎంత మంది వస్తారో రండి! కలిసి వచ్చినా.. మాకు ఇబ్బంది లేదు. మాదే గెలుపు`` అని కుండబద్దలు కొట్టినట్టుచెప్పాలి. కానీ, అలా చెప్పడం లేదు. పైగా ఎక్కడ కలుస్తారో.. అనేబెంగ పట్టుకుంది. మరి దీనికి కారణం.. వారు కలిసి వస్తే.. వైసీపీ చిత్తుగా ఓడిపోవడం ఖాయమని లెక్కలు వేసుకున్నట్టేగా! అని అంటున్నారు పరిశీలకులు.
వాస్తవానికి వచ్చే ఎన్నికల్లో జనసేన-టీడీపీ కలిసి పోటీ చేస్తాయనే ప్రచారం తెరమీదికి వచ్చినప్పటి నుంచి వైసీపీలో గుబులు బయలు దేరింది. అందుకే.. ఎప్పటికప్పుడు ఆ పార్టీలను రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు సంధిస్తోంది. దమ్ముంటే.. ఒంటరిగా పోటీ చేయాలంటూ.. కామెంట్లు చేస్తోంది. కానీ, మరోవైపు.. తమను మించిన ప్రభుత్వం లేదని.. తాము అమలు చేస్తున్న స్థాయిలో సంక్షేమాన్ని ఏ ప్రభుత్వమూ చేయలేదని చెబుతోంది.
మరి ఇంత నమ్మకం ఉన్నప్పుడు.. ప్రజల్లో తమకు భారీ ఫాలోయింగ్ ఉందని నమ్మినప్పుడు.. వైసీపీ ఇంత బేలగా ఎందుకు మారిపోవాలి? ఎందుకు ఇతర పార్టీల్లో చిచ్చు పెట్టి.. ఆగ్యాప్ నుంచి తాము లబ్ధి పొందాలని.. అధికారం దక్కించుకోవాలని ఆశించాలి? తక్కువ సీట్లే వచ్చినా.. అధికారం కోసం ఎందుకు పాకులాడాలి? అనేవి మిలియన్ డాలర్ల ప్రశ్న. ఏదేమైనా.. వైసీపీ వ్యూహం ఆ పార్టీకే మైనస్‌గా మారుతోందని అంటున్నారు పరిశీలకులు.