ఈ మధ్యన మంగళగిరిలోని పార్టీ అఫీసులో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వైసీపీ మీద ఒక రేంజిలో ఫైర్ అయ్యారు. అనుచితమైన కామెంట్స్ చేశారు. ప్రత్యేకించి వైసీపీలో ఉన్న కాపు ఎమ్మెల్యేల మీద ఆయన చేసిన హాట్ కామెంట్స్ రచ్చను రగిలించాయి. ఏకంగా చెప్పు చూపిస్తూ ఆయన చేసిన వ్యాఖ్యలు కూడా అగ్గి పుట్టించాయి. పవన్ మీద ఆ రోజు వరసగా వైసీపీ మంత్రుల నుంచి ఎటాక్ వచ్చినా అది పెద్దగా సౌండ్ ఇవ్వలేదు అనే అంతా అంటున్నారు.
దాంతో పాటు వైసీపీలో ఉన్న కాపు మంత్రులు ఎమ్మెల్యేల మీద పవన్ కామెంట్స్ చేస్తూ వారితో తాను సోదరా అని పిలిపించుకోవ్డానికి కూడా ఇష్టపడడంలేదని చెప్పిన తీరుకు వారు మండిపోతున్నారు. పవన్ కళ్యాణ్ కి వైసీపీలో ఉన్న కాపులు కాపులుగా కనిపించడంలేదా అన్న ఆగ్రహం కూడా వారిలో కనిపిస్తోంది. అలాగే కాపులంతా కూడా తన వెంటే ఉన్నారని పవన్ చెప్పుకోవడాన్ని కూడా వైసీపీలోని కాపు మంత్రులు ఎమ్మెల్యేలు తప్పు పడుతున్నారు.
పవన్ రాజకీయానికి రివర్స్ లో సరైన జవాబు చెప్పడానికి అంతా తయారుగా ఉన్నారని అంటున్నారు. అందుకే ఈ నెల 31న రాజమండ్రి వేదికగా కాపు ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎంపీలు అంతా కలసి కీలకమైన సమవేశాన్ని నిర్వహించనున్నారని తెలుస్తోంది. ఈ సమావేశంలో పవన్ తమ మీద చేసిన అనుచిత వ్యాఖ్యల మీద చర్చిస్తారు అని అంటున్నారు. పవన్ సీరియస్ గానే తమ మీద మాటల దాడి మొదలెట్టారని గ్రహించిన వైసీపీలోని కాపు ఎమ్మెల్యేలు తమను తాము కాపాడుకుంటూనే పవన్ని గట్టిగా కట్టడి చేయడానికి సరైన వ్యూహాన్ని రూపించించాలనుకుంటున్నారని తెలుస్తోంది.
అదే విధంగా తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నపుడు కాపు ఉద్యమం చేసిన కాపు నాయకుడు ముద్రగడ పద్మనాభం మీద చంద్రబాబు సర్కార్ దమననీతిని ప్రయోగించి నానా రకాలుగా అవామిన్స్తే పవన్ ఎక్కడ ఉన్నారు అన్నది కూడా వారు ప్రశ్నించడం ద్వారా పవన్ని డిఫెన్స్ లో నెట్టే ప్రయత్నం చేయబోతున్నారు అని అంటున్నారు. అదే విధంగా చంద్రబాబుతో రాజకీయ చెలిమి చేస్తూ గుత్తమొత్తంగా కాపుల ఓట్లను తీసుకెళ్లి టీడెపీఎ ఖాతాలో వేసి బాబుని సీఎం చేయడానికి పవన్ తాపత్రయపడుతున్నారు అన్నది కూడా కాపు సామాజికవర్గంలో పెట్టి ఆయన్ని గట్టిగా ఎండగట్టాలని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది.
అదే విధంగా కాపులు తన వైపే అని పవన్ జబ్బలు చరచి చెప్పడానికి కూడా ఒక సవాల్ గా వైసీపీ కాపు నేతలు తీసుకున్నట్లుగా తెలుస్తోంది. పవన్ వైపు కాపులు ఉంటే జరిగే నష్టం ఏంటో కూడా తమ సామాజికవర్గానికి వివరించడం ద్వారా వారు పవవ్ బాబు చెలిమిని పూర్తిగా విమర్శించడం ద్వారా జనసేన టీడీపీ పార్టీల పొత్తుని చిత్తు చేసే ఎత్తులను కూడా వేయబోతున్నారు అని అంటున్నారు.
అదే విధంగా వైసీపీ ప్రభుత్వంలో కాపులకు అందిన ప్రయోజనాలు, వారికి సమకూరుతున్న లబ్దిని కూడా పూర్తిగా సొంత సామాజికవర్గానికి వివరించడం ద్వారా వారిని చేరువ చేసుఇఓవడానికి కూడా సరైన వ్యూహాలను రూపకల్పన చేస్తారు అని అంటున్నారు. మొత్తానికి మెత్తగా ఉంటే పవన్ తో కుదిరే వ్యవహారం కాదని ఆయనతో గట్టిగానే అగ్రెస్సివ్ మోడ్ లోనే ఉండాలని వైసీపీ కాపు నేతలు నిర్ణయించారని అంటున్నారు. ఎన్నికలు దగ్గరలో ఉండగా జరుగుతున్న ఈ సమావేశం అత్యంత కీలకంగా మారనుంది అంటున్నారు. అదే టైం లో పవన్ కి కౌంటర్ స్ట్రాటజీలను కూడా సిద్ధం చేయబోతోంది అంటున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.