ఆత్మగౌరవ డ్రామా..తెలుగోళ్లది కాదు బాబూ..

Update: 2018-11-01 06:15 GMT
అవసరాలు అన్నీ చేయిస్తాయి.. వసుదేవుడంతటి వాడే గాడిద కాళ్లు పట్టుకోంగా లేనిదే.. నాకంటే బాగా చిన్నవాడైనా రాహుల్ గాంధీ శరణు కోరితే తప్పా.. అని బాబు గారు వాపోయారు.. నా ఇమేజ్ డ్యామేజ్ చేసుకొని చిన్న పార్టీల వద్దకు నేనే స్వయంగా వెళ్లి మాట్లాడుతున్నానని మొసలికన్నీరు కార్చాడు.. అయ్యో పాపం.. బాబుకు ఎంత కష్టమొచ్చిందే అని అందరూ అనుకునేలా చేసుకుంటున్నాడు.. సెంటిమెంటుకు యాంటిమెంటూ పూసేసి.. సింపథీ తెచ్చేసుకుంటున్నాడు..

ఏపీ సీఎం చంద్రబాబు .. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీని కలిసేది ‘తెలుగువారి ఆత్మగౌరవం’ కోసమేనని తాజాగా మంత్రుల సందేహానికి సమాధానమిచ్చేశాడు. అది ఆయన పచ్చపత్రికలో ప్రధానంగా అచ్చేశారు. కానీ ఇక్కడే లాజిక్ మిస్సయ్యింది. ఆత్మగౌరవం ఎప్పుడో కొట్టుకుపోయింది. బీజేపీ మోసం చేసినప్పుడు హోదా ఇవ్వనప్పుడు గుర్తుకు రాని ఆత్మగౌరవ నినాదం.. ఇప్పుడు ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ పై హత్యాయత్నం జరగ్గానే ఎందుకు గుర్తొచ్చిందన్నదే ప్రశ్న.  ఢిల్లీలోని బీజేపీ వ్యతిరేక చిన్నా చితక పార్టీలను శరణు వేడే పరిస్థితి ఇప్పుడే ఎందుకు  అసలు ఎందుకొచ్చింది.? ఎందుకిలా బాబు పాకులాడుతున్నాడు.?

అంటే కారణం ఉంది. వైఎస్ జగన్ పై జరిగిన హత్యాయత్నంలో టీడీపీ నేతల ప్రమేయముందనే ఆరోపణలు వైసీపీ నేతలు చేస్తున్నారు. నిందితుడు శ్రీనివాస్ పనిచేస్తున్న రెస్టారెంట్ ఓనర్ కూడా టీడీపీ నేతనే..ప్రతిపక్ష నాయకుడినే లేపద్దామనుకున్న స్కెచ్ పారకపోవడంతో ఇప్పుడు కుడితిలో  పడ్డ ఎలుకలా అందరి పంచన చేరుతున్నాడని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. తెలుగు వారి ఆత్మ గౌరవాన్ని నిలబెట్టేందుకు కాంగ్రెస్ తో కలుస్తానని బీరాలు పలుకుతున్నాడు.

నిజానికి ఇప్పుడు తెలుగువారికి వచ్చిన ఆపద ఏం లేదు. వారి ఆత్మగౌరవాలు ఏం దెబ్బ తినలేదు.. దెబ్బతిన్నదల్లా బాబు ఆత్మగౌరవమే.. వైఎస్ జగన్ పై హత్యాయత్నం తన మీద పడుతుందేమోనని.. సంశయించి.. దానికి ఆత్మగౌరవం ముసుగేసి ఢిల్లీ గల్లీలో చెప్పులు అరిగేలా బీజేపీ వైరిపక్షాలు శరణుకోరుతున్నాడని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఇలా బాబు ఆత్మగౌరవ డ్రామా.. తెలుగోళ్లది కాదని.. కేవలం ఆయనదేనంటున్నారు..
Tags:    

Similar News