ఒక ప్రతిపక్ష నేతపై జరిగిన హత్యాయత్నాన్ని ఒక క్రైమ్ గా చూడకపోవడమే... కాకుండా దాని చుట్టూ డ్రామా అల్లి, అందులో బాధితుడినే ఇరికించాలని చూసిన తెలుగుదేశం పార్టీ అసలు రంగును బయటపెడుతూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఒక సీరియస్ స్టెప్ తీసుకుంది. విజయసాయిరెడ్డి నేతృత్వంలో వైసీపీ ఈ విషయంపై రాష్ట్ర పతికి ఫిర్యాదు చేసింది. అనంతరం వారు మీడియాతో మాట్లాడారు.
తమ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డి పై హత్యాయత్నం జరిగితే ప్రాథమిక విచారణకు ముందే అనుమానాస్పద వ్యాఖ్యలు చేయడంతో మాకు ఏపీ ప్రభుత్వం చేస్తున్న విచారణపై నమ్మకం లేదని విజయ సాయి రెడ్డి అన్నారు. ఈ కేసులో సాక్ష్యాలు మాయం కాక ముందే థర్డ్ పార్టీతో దీనిపై దర్యాప్తు చేయించాలని కోరుతూ వారు రాష్ట్రపతికి వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా వైసీపీ కేసు పురోగతిపై ఆవేదన వ్యక్తం చేసింది. వైసీపీ ఇదే విషయంపై హైకోర్టులో పిటిషను కూడా వేసింది.
ఇక ముందు నుంచి ఈ కేసు వ్యవహారంలో వైసీపీ వ్యక్తం చేస్తున్న అనుమానాలే జనాలకు కూడా ఉన్నాయి. ఎందుకంటే... ఏ క్రైమ్ లోనూ సాధారణంగా రాజకీయ నేతలు ఈ స్థాయిలో స్పందించరు. కానీ గుమ్మడి కాయల దొంగ ఎవరంటే భుజాలు తడుముకున్నట్టు ప్రతి టీడీపీ నేత ఈ కేసుపై స్పందించారు. చివరకు తల్లి విజయమ్మపై - చెల్లి షర్మిలపై నిందలు వేసే స్థాయికి దిగజారారు టీడీపీ నేతలు. దీంతో వైసీపీ అనుమానాలు బలపడ్డాయి. అందుకే రాష్ట్రపతి వద్దకు వెళ్లినట్లు తెలుస్తోంది.
ఈ సందర్భంగా విజయ సాయి రెడ్డి చంద్రబాబును ఈ కేసులో అసలు దోషిగా అనుమానించారు. చంద్రబాబు సారథ్యంలో వేసిన ఈ ప్రణాళిక సినిమా ఆర్టిస్టు శివాజీ ద్వారా చాలా దూరదృష్టితో వేరే వాళ్లపై నెట్టేసి కథ నడిపించారన్నారు. బయటపడకుండా ఉండటానికే నోటికి వచ్చిన వారిపై నిందలు వేశారన్నారు. చంద్రబాబుతో పాటు.. మంత్రి ఆదినారాయణ రెడ్డి - టీడీపీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావులు తదితరులు ఇందులో కుట్రదారులు అని ఆయన పేర్కొన్నారు.