కేంద్రహోంమంత్రిని కలిసిన వైసీపీ నేతలు

Update: 2018-10-29 06:22 GMT
వైసీపీ పోరుబాట పట్టింది. తమ అధ్యక్షుడిపై దాడిని కేంద్రం దృష్టికి తీసుకెళ్లింది.  వైసీపీ నేతల బృందం కేంద్రహోంశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ను కలిసింది. వైసీపీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై జరిగిన హత్యాయత్నంపై కేంద్ర ప్రభుత్వ సంస్థలతో దర్యాప్తు జరిపించాలని వారు విన్నవించారు. వైవీ సుబ్బారెడ్డి - మేకపాటి రాజమోహన్ రెడ్డి - విజయసాయి రెడ్డి - బొత్స సత్యనారాయణ - ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు - వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి - వర ప్రసాద్ లు కేంద్రమంత్రిని కలిసిన అనంతరం విలేకరులతో మాట్లాడారు..

వైసీపీ నేతలు మాట్లాడుతూ.. ఈనెల 25న వైఎస్ జగన్ పై జరిగిన హత్యాయత్నం గురించి వివరించామని.. రాజ్ నాథ్ సింగ్ సానుకూలంగా స్పందించి కేసు పరీశీలిస్తామని హామీ ఇచ్చారని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం అన్ని రకాలుగా సహాయ పడుతుందని వివరించారు.వైఎస్ జగన్ కు మరింత భద్రత కల్పించాలని కోరామని తెలిపారు.

ఏపీలో వైఎస్ జగన్ విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు - టీడీపీ నేతలు వ్యవహరించిన తీరును కూడా కేంద్ర హోంశాఖమంత్రికి వివరించినట్టు వైసీపీ నేతల బృందం తెలిపింది. ఆపరేషన్ గరుడ అంటా నానా యాగీ చేస్తున్నారని.. దీని వెనుక ఎవరున్నారు.? ఎవరు చేయిస్తున్నారు.? ఏ విధంగా పథకం ప్రకారం ఇవన్నీ చేయిస్తున్నారో విచారణ చేయాలని కోరామని తెలిపారు. శ్రీకాకుళం తిత్లీ తుఫాను బాధితులకు కేంద్రం సహాయం చేయాలని కోరినట్లు తెలిపారు.
   

Tags:    

Similar News