ప్రజాస్వామ్యంలో ఉన్నత పదవులు పొందడానికి భాష - ప్రాంతం ఎప్పుడూ అడ్డంకి కాదు. దీనికి ఆనాటి ముఖ్మమంత్రి టి. అంజయ్య ఒక సాక్ష్యమైతే - ఈనాటి ప్రధాని నరేంద్ర మోదీ సజీవ సాక్ష్యం. ప్రాధమిక విద్యాభ్యాసంతో చదువు ముగించిన అంజయ్య ఆంధ్రప్రదేశ్ ముఖ్మమంత్రిగా పనిచేసారు. ఇక టీ దుకాణం నడిపిన నరేంద్ర మోదీ భారత ప్రధాని అయ్యారు. ఇదీ భారత ప్రజాస్వామ్యా గొప్పతనానికి ప్రతీక. అయితే పదవిలోకి వచ్చిన తర్వాత నాయకులందరూ భాషను నేర్చుకున్నారు. ముఖ్యంగా విదేశాలలో పర్యటించిన సందర్భాలలో ఆయా దేశాల నాయకులతో మాట్లడడం కోసం ఇంగ్లీష్ నేర్చుకున్న నాయకులు ఉన్నారు. ఇదీ వారి గొప్పతనమే తప్ప చిన్నతనం కాదు. అయితే సమైక్య రాష్ట్రానికి పది సంవత్సారాలు - విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ కు నాలుగు సంవత్సరాలుగా ముఖ్యమంత్రిగా చేస్తున్న నారా చంద్రబాబు నాయుడు మాత్రం తన భాషను మార్చుకోలేదు. ఇదీ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అవమానకరంగా మారింది. ఇదే విషయాన్ని వైఎస్ ఆర్ కాంగ్రెస్ నాయకులు ఎద్దేవా చేస్తున్నారు. ఇటీవల ఓ సందర్భంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి ఇంగ్లీష్ ప్రసంగంపై వారు విమర్శలు గుప్పిస్తున్నారు. ఒక పర్యటనలో చంద్రబాబు నాయుడు మాట్లడుతూ.." 'I am technology, I make Amaravathi world capital' (నేనే టేక్నాలాజీని - అమరావతిని ప్రపంచ రాజధానిగా చేస్తాను). అని ప్రకటించారు. ఈ ప్రకటన చంద్రబాబు నాయడి ఇంగ్లీష్ పరిజ్నానాన్నే కాకుండా - ఆయన అజ్ఞానాన్ని కూడా బయట పెడుతోందని - వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే బుగ్గన్న రాజేంద్రనాథ్ రెడ్డి ఎద్దేవా చేసారు.
ఓ రాష్టానికి ముఖ్యమంత్రిగా అత్యున్నత పదవిలో ఉన్న వ్యక్తి ఇలాంటి భాషను ఉపయోగించడం ఆ రాష్ట్ర ప్రజలకు అవమానకరం అని ఆయన అంటున్నారు. గతంలో తెలుగుదేశం నాయకుడు - కేంద్ర మాజీ మంత్రి ఎర్రం నాయుడు తనకు ఇంగ్లీషు రాదని - తనకు వచ్చినట్లు గానే మాట్లాడతానని తనదీ గ్రామీన భాష అని ప్రకటించి జాతీయ మీడియాను తన వైపు తిప్పుకున్నారు. జాతీయ స్దాయిలో తానే సినీయర్ నాయకుడిని అని చెప్పుకుంటున్న చంద్రబాబు నాయుడు మాత్రం తన భాషతో ఆంధ్రప్రదేశ్ ప్రజలను అవమానిస్తున్నారని ప్రతిపక్ష నేతలు దుయ్యపడుతున్నారు. రాజకీయాలలోకి వచ్చిన తర్వాత భాషలను నేర్చుకోవాలని - ముఖ్యంగా ఇంగ్లీష్ నేర్చుకోవాలని - ఆ శ్రద్ద లేకపోతే అవమాన పడడమే కాక రాష్ట్రనికి ఇబ్బందులు కలుగుతాయని వారంటున్నారు. ఈ ఎస్ - నో ఆల్ రైట్ ఇంగ్లీష్ తో తెలుగు ప్రజల పరువు పోతోందని ఇకనైన ఇలాంటి భాషకు ఫుల్ స్టాప్ పెట్టాలని వారు కోరుకుంటున్నారు.