టీవీ డిబేట్ లలో వైసీపీ వాళ్లు వీక్ అవుతున్నారా?

Update: 2019-10-15 14:30 GMT
మంచిగా పాలన చేస్తే చాలదు.. తమ పాలన గురించి విపులంగా చెప్పగలగాలి - గణాంకాలు చెప్పి - గతానికి - ఇప్పటికి ఉన్న తేడా ఏమిటో విశదీకరించగలగాలి.. ఏ రాజకీయ పార్టీకి అయినా ఈ విషయాలు చాలా ఇంపార్టెంట్ అనే విషయం అందరికీ తెలిసిందే. అయితే ఏపీలో అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో నేతలు మాత్రం ఈ విషయాలను గమనించినట్టుగా లేరు.

ప్రస్తుతం టీవీ చర్చా కార్యక్రమాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వాళ్ల వాదనలు అంత గట్టిగా వినిపించడం లేదు.  చంద్రబాబు నాయుడు తీరులో - తెలుగుదేశం తీరులో బోలెడన్ని  తప్పులుంటున్నాయి. అలాగే జగన్ పాలనలో సరిచేసిన అంశాలూ బోలెడన్ని ఉన్నాయి. అయితే తెలుగుదేశం పార్టీ వాళ్లు అన్నీ తమ ఘనతలుగానే చెప్పుకుంటూ ఉంటారు.

ఆఖరికి నవరత్నాలు పథకాలు కూడా తమ వే అన్నట్టుగా తెలుగుదేశం పార్టీ వాళ్లు మాట్లాడుతూ ఉన్నారు. ఇలా మాట్లాడి టీడీపీ నవ్వుల పాలే అవుతుంది. అయితే గట్టిగా రిటర్న్ ఇవ్వడంలో మాత్రం వైసీపీ నేతలు అంత ఊపు మీద కనపడరు.

అందుకు కారణం.. వారి వద్ద సరైన సమాచారం లేకపోవడం - గణాంకాలు తెలియకపోవడం - సమర్థవంతంగా వాదించడం చేతగాక పోవడం. ఉదయం లేస్తే టీవీ చానళ్లలో చర్చా కార్యక్రమాలు సాగుతూ ఉంటాయి. అలంటి వాటిల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కాస్త చేతనయ్యే వాళ్లను కూర్చోచెట్టాలని పరిశీలకులు అంటున్నారు.

తెలుగుదేశం పార్టీ తమ వాదనల విషయంలో అడ్డగోలుగా అయినా చెలరేగుతుంది. అందుకు సంబంధించి ఆ పార్టీకి ఏర్పాట్లున్నాయి.  నాలెడ్జ్ సెంటర్ అంటూ నడుపుతున్నారు. ఇలాంటి నేపథ్యంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సబ్జెక్ట్ లేని వాళ్లను వాదనకు పంపితే అంతే సంగతులు. టీవీ చానళ్ల ప్రభావం - వాటిల్లో జరిగే చర్చా కార్యక్రమాల ప్రభావం కూడా ఎంతో కొంత ఉంటుంది. ఇలాంటి నేపథ్యంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విషయం పై దృష్టి సారించాలని - వీక్ అవుతున్న టీవీ డిబేట్ల విషయంలో మేలుకోవాలని పరిశీలకులు అంటున్నారు.
Tags:    

Similar News