ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఆసక్తికర పోరు సాగుతోంది. ఇప్పటికే ఉపాధ్యాయ - పట్టభద్రుల నియోజకవర్గాలు, స్థానిక సంస్థల కోటా నియోజకవర్గాలకు సంబంధించి నామినేషన్లు పూర్తయ్యాయి. రేపు సాయంత్రంలోగా స్థానిక సంస్థల కోటా బరిలో ఎవరు బరిలో ఉంటారన్న విషయం తేలిపోనుంది. ఆ వెనువెంటనే కీలకమైన ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు తెర లేవనుంది. ఈ ఎన్నికలకు సంబంధించి అధికార పార్టీ టీడీపీ అభ్యర్థుల ఖరారుకు సంబంధించి తర్జనభర్జనలు పడుతోంది.
అదే విపక్ష స్థానంలో ఉన్నా వైసీపీ మాత్రం దూకుడు ప్రదర్శిస్తోంది. తనకున్న బలం మేరకు ఆయా స్థానాలు పోటీ చేస్తూ సాగుతున్న వైసీపీ అభ్యర్థుల ఖరారు దగ్గర్నుంచి అభ్యర్థుల నామినేషన్లు - ప్రచారంలో దూసుకుపోతోంది. ఇందులో భాగంగా కాసేపటి క్రితం ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి తన అభ్యర్థులను ప్రకటించింది. ఆళ్ల నాని. గంగుల ప్రభాకర్ రెడ్డిలను తన అభ్యర్థులుగా ఆ పార్టీ ప్రకటించింది. పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఆళ్ల నాని... వైసీపీ జిల్లా అధ్యక్షుడిగా ఉన్నారు. గడచిన ఎన్నికలకు ముందు ఎమ్మెల్యేగా ఉన్న ఆళ్ల నాని... నాడు కష్టాల్లో ఉన్న జగన్‌కు అండగా నిలిచేందుకు వైసీపీలో చేరారు.
ఇక గంగుల ప్రభాకర్ రెడ్డి విషయానికి వస్తే... చాలా కాలం నుంచి కాంగ్రెస్ లో ఉన్న గంగుల... ఇటీవలే వైసీపీలో చేరారు. పార్టీలో చేరిక సందర్భంగా గంగులకు జగన్ హామీ ఇచ్చిన మేరకే ఎమ్మెల్సీ టికెట్ ఇచ్చినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే... ప్రస్తుతం అసెంబ్లీలో వైసీపీకి ఉన్న సంఖ్యా బలం ఆధారంగా ఓ ఎమ్మెల్సీ సీటును ఈజీగానే గెలుస్తుంది. మరో నాలుగైదు ఓట్లు తోడైతే... రెండో సీటును కూడా కైవసం చేసుకునే అవకాశాలున్నాయి.