విశాఖలోని రిషికొండలో అన్ని విధాలా పర్యావరణాన్ని దెబ్బ తీశారని రాష్ట్ర ప్రభుత్వంపై వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు ఉరఫ్ ఆర్ ఆర్ ఆర్ మండిపడ్డారు. రిషికొండ తవ్వకాల వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును పూర్తిగా తప్పుదారి పట్టిస్తోందని ఆరోపించారు. ఇప్పుడు రిషికోండలో ఏం జరుగుతుందో.. ఫొటోలు, వీడియోలు తీసి కోర్టుకు చెప్పండి అని విశాఖ ప్రజలకు రఘురామ సూచించారు. అన్ని విధాలా అక్కడి పర్యావరణాన్ని దెబ్బ తీశారని మండిపడ్డారు. ఈ విషయంలో సర్వోన్నత న్యాయస్థానానికి రాష్ట్ర సర్కార్ అన్నీ అబద్ధాలు చెబుతోందని ఆరోపించారు.
పర్యాటకం ముసుగులో.. సీఎం జగన్‌కు కావాల్సిన విధంగా 40 వేల చదరపు అడుగుల్లో నిర్మాణం చేపట్టి.. తాడేపల్లి నుంచి పూర్తిగా విశాఖకు తరలి వెళ్లేందుకు కుట్ర పన్నారని అన్నారు. నిర్మాణాలు చేపడుతున్న రిషికొండ ప్రాంతం సీఆర్‌జడ్-2లోకి వస్తుందా.. సీఆర్‌జడ్-3లోకి వస్తుందా అనే విషయాన్ని తేల్చమంటే.. రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు వెనకడుగు వేస్తోందని రఘురామ ప్రశ్నించారు. ``ఒక పక్క అమరావతిని అభివృద్ధి చేయమని కోర్టు చెబుతుంటే.. అక్కడేమో డబ్బులు లేవంటున్నారు. ఇక్కడేమో డబ్బులు ఖర్చు అయ్యాయని అంటున్నారు. ఇదేం దొంగ లెక్కలు`` అని విమర్శించారు.
టూరిజం ముసుగులో సీఎం కోసం నిర్మిస్తున్న వ్యవహారం ఇదని మండిపడ్డారు. ``దీనికి సంబంధించిన అన్ని విషయాలు బుధవారం కోర్టుకు చెబుతాను. అక్కడ ఉన్న నిర్మాణాలు విస్తరిస్తామని చెప్పి అనుమతులు తీసుకొని... మొత్తం కొండను తొలిచి 50 ఎకరాల్లో నిర్మాణాలు చేపడతారా? కోర్టు తుది తీర్పునకు లోబడి ఉంటామని అంటున్నారు. కట్టిన దాన్ని తీసేయాలని కోర్టు అంటే.. అప్పుడు ఏం చేస్తారు? ప్రస్తుతం విశాఖ రిషికొండ దగ్గర ఏం జరుగుతుందనే దానిమీద మీడియా మొత్తం దృష్టి పెట్టి ప్రజలకు చూపించాలి. `` అని వ్యాఖ్యానించారు.
``విశాఖ ప్రజలు కూడా ఇప్పుడు రిషికోండలో ఏం జరుగుతుందో.. ఫొటోలు, వీడియోలు తీసి కోర్టుకు చెప్పండి. విశాఖపట్నంలో చదువుకున్న అనుబంధం ఉంది నాకు. ఈ అనుబంధం కారణంగానే ఇంత పోరాటం చేయాల్సి వస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం 50 శాతం పని అయిందని కోర్టుకు అబద్ధాలు చెబుతోంది. కోర్టుకు అవాస్తవాలు చెప్పి.. నిజం చేయాలని చూస్తున్నారు. అవసరమైతే ఈ విషయంలో ఒక కమిటీని నియమించాలని సుప్రీంకోర్టును కోరతాను’ అని రఘురామ తెలిపారు.