కశ్మీర్‌ ఫైల్స్‌ మాదిరే "కాకాణి ఫైల్స్‌" సినిమా: ర‌ఘురామ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

Update: 2022-04-19 17:06 GMT
ఏపీ స‌ర్కారుపై త‌ర‌చుగా విమ‌ర్శ‌లు గుప్పిస్తున్న ఆ పార్టీ రెబ‌ల్ ఎంపీ ర‌ఘురామ‌కృష్ణ‌రాజు.. తాజాగా నెల్లూరు ఘ‌ట‌న‌ల‌పై స్పందించారు. ముఖ్యంగా నెల్లూరు కోర్టులో జ‌రిగిన దొంగ‌త‌నం.. త‌ద‌నంత‌ర ప‌రిణామాల‌పై ఆయ‌న ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. ఈ దొంగ‌త‌నం ఎవ‌రికీ అంతు ప‌ట్ట‌డం లేద‌న్న ఆయ‌న‌.. ఎస్సీ చేసిన వ్యాఖ్య‌లు.. చాలా వ్యూహాత్మ‌కంగా ఉన్నాయ‌ని.. అన్నారు. దీనిని సినిమాగా తీయొచ్చని వ్యాఖ్యానించారు.

కశ్మీర్‌ ఫైల్స్‌ మాదిరే "కాకాణి ఫైల్స్‌" సినిమా తీయవచ్చని  ఎంపీ రఘురామకృష్ణరాజు తెలిపారు. స్క్రాప్‌ దొంగతనానికి వచ్చిన దొంగలు కాకాణి ఫైల్స్‌ ఎత్తుకుపోవడమేమిటో అర్థం కావడం లేదన్నారు.నెల్లూరు జిల్లా ఎస్పీ చెప్పిన కథ నిజమై ఉండొచ్చని ఆయన వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు.  కశ్మీర్‌ ఫైల్స్‌ మాదిరే మన రాష్ట్రంలో కాకాణి ఫైల్స్‌ సినిమా తీయవచ్చని  ఎంపీ పేర్కొన్నారు. ఢిల్లీలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు.

స్క్రాప్‌ దొంగతనానికి వచ్చిన ఇద్దరు దొంగలను చూసి కుక్కలు మొరిగితే వారు భయపడి కోర్టు పైఅంతస్తుకు వెళ్లి తలుపులు పగులగొట్టారని నెల్లూరు జిల్లా ఎస్పీ చెప్పిన కథ నిజమై ఉండొచ్చని ఆయన వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు.  స్క్రాప్‌ దొంగతనానికి వచ్చిన దొంగలు కాకాణి ఫైల్స్‌ ఎత్తుకుపోవడమేమిటో అర్థం కావడం లేదని రఘురామ అన్నారు. భగవంతుని బలం, కొందరి స్క్రీన్‌ప్లేతో అలాంటి ఘటనలు జరగుతుంటాయన్నారు.

నెల్లూరులో వైసీపీ రాజకీయ కక్షలు చెలరేగిపోతున్నాయన్నారు. మొన్నటి వరకు మంత్రి కాకాణి ఫ్లెక్సీలు తొలగింపు, తాజాగా ఎంపీ వీపీఆర్ ఫ్లెక్సీలు తొలగించారని అన్నారు. వైసీపీ కక్షలు కులాల మధ్య చిచ్చుగా మారుతున్నాయని చెప్పారు. ఫ్లెక్సీలు చించేవారిని పోలీసులు నిలువరించలేకపోతున్నారని ఎంపీ విమ‌ర్శించారు.

అంబటి రాంబాబుకు గతంలో మంత్రి పదవి లేకపోయినా ‘నోటి’ పారుదల శాఖ ఉండేదని.. ఇప్పుడు నీటి పారుదల శాఖ మంత్రి అయ్యారన్నారు. పోలవరం ఎప్పుడు పూర్తవుతుందో ముఖ్యమంత్రి, అంబటి చెప్పాలని ఆయన డిమాండ్‌ చేశారు. చేస్తున్న అప్పుల్లో నీటిపారుదల శాఖకు ఎంత కేటాయిస్తారో చెప్పాలన్నారు.
Tags:    

Similar News