వైసీపీ తిరుగుబాటు ఎంపీ రఘురామకృష్ణంరాజు అప్పుడే మాజీమంత్రి పొంగూరు నారాయణ భవిష్యత్తును చెప్పేశారు. విచారణలో ఏపీసీఐడీ ట్రీట్మెంట్ ఎలాగుంటుందో తిరుగుబాటు ఎంపీకి అనుభవమే కదా. సీఐడీ విచారణ జరిగి ఇంతకాలమైనా పాపం ఎంపీ ఇంకా ఆ ట్రీట్మెంట్ ను మరచిపోలేకపోతున్నట్లున్నారు. అందుకనే తాజాగా అరెస్టయిన నారాయణపై సింపథీ చూపిస్తున్నారు.
మాజీ మంత్రి అరెస్టవ్వగానే రాజు మీడియాతో మాట్లాడుతు సీఐడీ ట్రీట్మెంటును తట్టుకోగలరో లేదో అంటు జాలి మాటలు మాట్లాడుతున్నారు. 10వ తరగతి ప్రశ్నాపత్రం లీకేజీలో ప్రధాన పాత్ర నారాయణదే అన్న ఆరోపణలతో సీఐడీ పోలీసులు ఉదయం హైదరాబాద్ లోని సొంతింట్లో ఉండగా మాజీమంత్రిని అరెస్టు చేసిన విషయం తెలిసిందే. హైదరాబాద్ లో అరెస్టుచేసి విచారణ నిమ్మితం చిత్తూరుకు తీసుకెళ్ళి తర్వాత కోర్టులో ప్రవేశపెట్టబోతున్నారు.
ఎప్పుడైతే నారాయణ అరెస్టు విషయం బయటపడిందో అప్పటినుండి చంద్రబాబునాయుడుతో సహా తమ్ముళ్ళంతా ఒకటే గోల మొదలుపెట్టేశారు. ఇదే నేపధ్యంలో రఘురాజు కూడా మీడియా ముందుకు వచ్చేశారు. గత ఏడాది విచారణ పేరుతో అదుపులోకి తీసుకుని తనను చిత్రహింసలు పెట్టినట్లే ఇపుడు నారాయణకు కూడా అలాగే జరుగుతందన్నారు. గదిలోకి తీసుకుపోగానే ముందు సీసీ కెమెరాలు తీసేస్తారట. తర్వాత వ్యక్తిగత సిబ్బందిని బయటకు పంసేస్తారట. గదిలోకి తీసుకెళ్ళినపుడు అధికారులు క్రూరమృగాల కన్నా ఘోరంగా ప్రవర్తిస్తారని చెప్పారు.
10వ తరగతి ప్రశ్నాపత్రం లీకైందని జగన్మోహన్ రెడ్డి చెబుతుంటే మంత్రి బొత్సా సత్యనారాయణ మాత్రం ప్రశ్న పత్రాలు లీక్ కాలేదని కేవలం మాస్ కాపీయింగ్ మాత్రమే జరిగిందని చెప్పటం ఏమిటంటు మండిపడ్డారు. ఇద్దరిలో ఎవరి మాట జనాలు నమ్మాలని అడిగారు. జగన్ మాటలే నిజమైతే విద్యాశాఖ మంత్రిని కూడా అరెస్టు చేయాలి కదా అంటు పిచ్చి లాజిక్ మాట్లాడారు. ఒకవేళ బొత్సా చెప్పిందే నిజమైతే జగన్ను కూడా అరెస్టు చేయాలికదాన్నారు. ఒక కేసులో నారాయణను అరెస్టు చేసి తీసుకెళుతుండగానే కొత్త కేసు పెట్టడం ఏమిటంటు రఘురాజు నిలదీశారు.