ఆ రెండు సినిమాలపై వైసీపీ వాళ్లు తప్పుడు రివ్యూలు రాస్తారు: ఆర్‌ఆర్‌ఆర్ సంచలన వ్యాఖ్యలు!
నరసాపురం వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు మరోమారు సంచలన వ్యాఖ్యలు చేశారు. సంక్రాంతికి విడుదలవుతున్న రెండు సినిమాలు.. వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి సినిమాలపై తమ ౖÐð సీపీ పార్టీకి చెందినవారు తప్పుడు రివ్యూలు రాస్తారని హాట్ కామెంట్స్ చేశారు. తద్వారా చిరంజీవి, బాలకృష్ణ అభిమానుల మధ్య గొడవలు పెడతారని వ్యాఖ్యానించారు. ఒకరి ఫ్యాన్స్ గా చెప్పుకుంటూ మరికొరి ఫ్యాన్స్ పై విమర్శలు చేస్తారని వెల్లడించారు. ఈ విషయంలో చిరంజీవి, బాలకృష్ణ అభిమానులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ మేరకు రఘురామకృష్ణరాజు ట్వీట్ చేశారు.
''సంక్రాంతికి విడుదల కానున్న వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి.. రెండు చిత్రాలు హిట్ అవ్వాలి. మా పార్టీకి చెందినవారు వేరే పేర్లతో తప్పుడు రివ్యూలు రాస్తారు. ఒకరి ఫ్యాన్స్ గా చెప్పుకుంటూ మరొకరిపై విమర్శలు గుప్పిస్తారు. బాలకృష్ణ గారి ఫ్యాన్స్, చిరంజీవి గారి ఫ్యాన్స్ అప్రమత్తంగా ఉండాలి'' అని రఘురామకృష్ణరాజు తన ట్వీట్ లో హాట్ కామెంట్స్ చేశారు.
ఇప్పుడు రఘురామ ట్వీట్ వైరల్ గా మారింది. దీంతో అవును నిజమేనంటూ చిరు, బాలయ్య అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. మీరు చెప్పింది నిజమేనని.. బాలయ్య డీపీ పెట్టుకుని చిరంజీవి సినిమా మీద, చిరు, పవన్ డీపీలు పెట్టుకుని బాలయ్య సినిమా నెగిటివ్ రివ్యూలు ఇస్తారని ఫ్యాన్స్ అంటున్నారు. ఈ విషయంలో మీరు చెప్పినట్టే అప్రమత్తంగా ఉంటామని రఘురామకృష్ణరాజుకు రిప్లై ఇస్తున్నారు. మరికొంతమంది ఆర్‌ఆర్‌ఆర్ ట్వీట్ ను రీట్వీట్ చేశారు.
కాగా గత ఎన్నికల్లో వైసీపీ తరఫున నరసాపురం నుంచి ఎంపీగా గెలిచిన రఘురామకృష్ణరాజు ఆ తర్వాత కొద్ది కాలానికే ఆ పార్టీతో విభేదించారు. నిత్యం రచ్చబండ పేరుతో వైసీపీ ప్రభుత్వ విధానాలు, వైఫల్యాలపై హాట్ కామెంట్స్ చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో రఘురామకృష్ణరాజుపై రాష్ట్రవ్యాప్తంగా పలు పోలీస్ స్టేషన్లలో రాజద్రోహం కింద కేసులు నమోదు చేశారు. ప్రభుత్వాన్ని అస్థిర పరిచేందుకు ప్రయత్నిస్తున్నారని పలు సెక్షన్ల కింద కేసు పెట్టారు. ఇప్పటికే ఒకసారి సీఐడీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తనపై థర్డ్ డిగ్రీ కూడా ప్రయోగించారని రఘరామ తీవ్ర ఆరోపణలు చేశారు.
ప్రస్తుతం రఘురామకృష్ణరాజు హైదరాబాద్ కే పరిమితమయ్యారు. ఏపీకి రావాలని రెండుమూడు సార్లు ప్రయత్నించినా ఆయనను పోలీసులు అడ్డుకునే అవకాశం కనిపించడంతో రాలేకపోయారు. కొద్ది రోజుల క్రితం ఆయన హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తనపై ఏపీలో ఎన్ని కేసులు ఉన్నాయో, ఏయే స్టేషన్లలో కేసులు నమోదు చేశారో తనకు తెలియజేయాలని డీజీపీని ఆదేశించాలని కోరుతూ హైకోర్టులో పిటిషన్ వేశారు.