‘‘ఏదో ఒక రోజు బికారి అవుతాడు... తికానా లేకుండా పోతాడు... రావణుడి గర్వం ఎలా అణిగిందో అతడి గర్వం కూడా ఎదో ఒక రోజు అలాగే అణుగుతుంది’’ టీం ఇండియా కెప్టెన్ ధోనీపై... క్రికెటర్ యువరాజ్ సింగ్ తండ్రి చేసిన వ్యాఖ్యలు ఇవి! ప్రపంచ కప్ క్రికెట్ కు యువరాజ్ ను ఎంపిక చేయకపోవడం కేవలం ధోనీకి యువరాజ్ పై ఉన్న భయం, కుళ్లే కారణం అని గతంలోనే యోగరాజ్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. అయితే ఈ సారి తిట్ల డోస్ మరింత పెంచారు యోగిరాజ్. తనలో విషయం లేక పోయినా మీడియా ఇచ్చిన హైప్ వల్లే అతడు క్రికెట్ దేవుడయ్యాడు కానీ... నేనే విలేఖరిని అయితే ధోనీ చెంప చెళ్లుమనిపించేవాడినని యోగ్ రాజ్ అంటున్నారు. ధోనీ స్థాయి చాలా చిన్నది, మీడియానే అనవసరంగా అతనికి ఇంత హైప్ ఇచ్చింది అని మధ్యలో మీడియాని తాలింపెట్టేస్తున్నారు. ఇలా ఒక రేంజ్ లో ధోనీపై విమర్శలు చేసేస్తున్నారు.
తండ్రి ఈ స్థాయిలో చెలరేగి ధోనీపై బ్యాటింగ్ చేస్తుంటే... మరో వైపు కొడుకు యువరాజ్ మాత్రం సన్నాయి నొక్కులు నొక్కుతూ... ధోనీని లాలిస్తున్నాడు. తన తండ్రి యోగ్ రాజ్ వ్యాఖ్యలతో తనకు సంబంధం లేదని అంటూ... ధోనీ నాయకత్వంలో ఆడడాన్ని ఆస్వాదించానని, ఆస్వాదిస్తానని... ఈ విషయం ఇంతకముందే చాలా సార్లు చెప్పానని, ధోనీతో తనకు ఎటువంటి ఇబ్బందీ లేదని యువరాజ్ టీట్ చేసాడు! ఈ తండ్రీ కొడుకులు ఇద్దరూ... ధోనీని ఒక ఆటాడుకుంటున్నారనే చెప్పాలి. ఒకరు కారం పూస్తుంటే మరొకరు వెన్న రాస్తున్నారు.