150, 100... ఇప్పుడు క్రికెటర్స్ వంతు!

Update: 2017-01-19 11:10 GMT
ఈ సంక్రాంతికి మెగాస్టార్ చిరంజీవి తన 150వ సినిమాతో వచ్చి సందడి చేయగా, లెజెండ్ బాలయ్య తన వందో సినిమాగా చారిత్రక సినిమాతో చరిత్ర సృష్టించాడు. పండగ సందర్భంగా విడుదలయిన ఈ రెండు సినిమాలు థియేటర్లలో బాక్సాఫీస్ రికార్డులు బద్దలు కొడుతున్నాయి. ఆ హీట్ ఇంకా చల్లారకముందే తాజాగా క్రికెట్ మైదానంలో మరో 150, 100 లతో కొత్త రికార్డులు సృష్టించారు యువరాజ్, మహేంద్ర సింగ్ ధోనీ!

ఇంగ్లండ్ తో కటక్ లోని బారాబతి స్టేడియంలో జరుగుతున్న రెండో వన్డేలో యువరాజ్ సింగ్ - మహేంద్ర సింగ్ ధోని జంట పాత రోజులను గుర్తుచేస్తూ కొత్త రికార్డులను నమోదు చేసింది. ఈ మ్యాచ్ లో 25 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయిన భారత్ పీకల్లోతు కష్టాల్లో ఉన్న సమయంలో రంగంలోకి దిగారు యువరాజ్ సింగ్-ధోని! మైదానంలో టీం ఇండియా సపోర్టర్స్ అంతా సైలంట్ ఉన్న సమయంలో మైదానంలోకి అడుగుపెట్టిన ఈ జంట... అలుపెరగని యోదుల్లా చెలరేగిపోయారు. "సమయము లేదు మిత్రమా.. నువ్వా.. నేనా.. ఫోరా.. సిక్సా.." అంటూ మైదానం నలువైపులా వీర బాదుడు బాదారు.

ఈ రకంగా తమదైన శైలిలో చెలరేగి ఆడిన ఈ జంట నాలుగో వికెట్ కు 256 పరుగుల రికార్డు భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. వీరిలో "ఆఫ్టర్ స్మాల్ గ్యాప్.. యూవీ ఇజ్ బ్యాక్" అంటూ చెలరేగిన యువరాజ్ సింగ్ 127 బంతుల్లో 150 (21x4, 3x6) చెలరేగి ఆడి వోక్స్ బౌలింగ్ లో బట్లర్ కు క్యాచ్ ఇచ్చి దొరికిపోగా... 115 బంతుల్లో 113* (10x4, 3x6) పరుగులతో క్రీజ్ లో ఉన్నాడు ధోనీ.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News