మొత్తానికి ఐపీఎల్ 12వ సీజన్ కోసం వేలం ముగిసింది. ఒకప్పటి భారత స్టార్ ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్ వేలం లో అమ్ముడవుతాడా లేదా అన్న ఉత్కంఠకు వేలం చివర్లో కానీ తెరపడలేదు. తొలి దశలో అతడిని ఏ ఫ్రాంఛైజీ కొనలేదు. అందరూ అతడి పేరు రాగానే ఎవరి పనిలో వాళ్లు ఉండిపోయారు. అనాసక్తిని ప్రదర్శించారు. కనీస ధర రూ.కోటికి కూడా యువీని ఎవరూ కొనకపోవడం అభిమానులకు ఆశ్చర్యం కలిగించింది. ఐతే చివరగా వేలంలోకి కొన్ని పేర్ల ను మళ్లీ తీసుకురాగా.. యువీ అప్పుడు అమ్ముడయ్యాడు. అతడిని ముంబయి ఇండియన్స్ కనీస ధరకే కొనుక్కుంది. యువీ కొనుగోలు వెనుక ముంబయి ఇండియన్స్ మెంటార్ సచిన్ టెండూల్కర్ ఉన్నట్లు సమాచారం. యువీ తో అతడికి మంచి స్నేహం ఉంది. యువీ కూడా అతడిని చాలా గౌరవిస్తాడు. ఈ నేపథ్యంలోనే సచిన్ ముంబయి యాజమాన్యానికి చెప్పి యువీని కొనుగోలు చేయించినట్లు సమాచారం.
ఇక వేలంలో ఇతర విషయాలకు వస్తే ఫాస్ట్ బౌలర్ జైదేవ్ ఉనద్కత్.. తమిళనాడు కు చెందిన మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి సమానంగా రూ.8.4 కోట్లకు అమ్ముడయ్యారు. వేలం లో వీరిదే అత్యధిక ధర. ఉనద్కత్ కోసం గత ఏడాది రూ.11.5 కోట్లు పెట్టి ఆశ్చర్యపరిచిన రాజస్థాన్ ఈసారి కూడా ఎక్కువ ధరే పెట్టింది. అతడిని గత సీజన్లో పేలవ ప్రదర్శన చేశారు. దీంతో రాజస్థాన్ వదిలించుకుంది. కానీ మళ్లీ వేలంలో పోటీ పడి రైట్ టు మ్యాచ్ ద్వారా అతడిని భారీ ధరకు దక్కించుకుంది. ఇదేం విచిత్రమో అర్థం కావడం లేదు. ఇక వరుణ్ అనే అనామకుడికి అంత రేటు పలకడమూ ఆశ్చర్యమే. అతను తమిళనాడు తరఫున దేశవాళీ క్రికెట్లో మెరిశాడు. బౌలింగ్ లో వైవిధ్యం ఉండటం.. మిస్టరీ స్పిన్నర్ గా పేరు తెచ్చుకోవడంతో భారీ ధర వచ్చినట్లు తెలుస్తోంది. అతడిని పంజాబ్ ఫ్రాంఛైజీ సొంతం చేసుకుంది.
మన తెలుగు కుర్రాడు హనుమ విహారిని రూ.2 కోట్లు పెట్టి ఢిల్లీ క్యాపిటల్స్ కొనడం విశేషం. కొన్ని నెలల కిందట భారత్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో సత్తా చాటిన ఇంగ్లాండ్ యంగ్ ఆల్‌రౌండర్ సామ్ కర్రాన్ రూ.7.2 కోట్లు పలికాడు. అతణ్ని పంజాబ్ సొంతం చేసుకుంది. దక్షిణాఫ్రికా ఆటగాడు కొలిన్ ఇన్‌గ్రామ్‌ను రూ.6.4 కోట్లు వెచ్చించి ఢిల్లీ కొనుగోలు చేసింది. రంజీ ట్రోఫీలో బుధవారమే వరుస బంతుల్లో 5 సిక్సర్లు బాదిన ముంబయి కుర్రాడు శివమ్ దూబేను బెంగళూరు రూ.5 కోట్లకు కొనడం విశేషం. కథ ముగిసిందనుకున్న మోహిత్ శర్మ మీద చెన్నై సూపర్ కింగ్స్ రూ.5 కోట్లు పెట్టింది. అక్షర్ పటేల్, కార్లోస్ బ్రాత్‌వైట్ కూడా రూ.5 కోట్ల చొప్పున ధర పలికారు. సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు సాహాను తిరిగి సొంతం చేసుకుంది. ఇంగ్లాండ్ వికెట్ కీపర్ జానీ బెయిర్ స్టో కూడా ఆరెంజ్ ఆర్మీలో చేరనున్నాడు. ప్రభ్ సిమ్రన్ సింగ్ అనే దేశవాళీ బ్యాట్స్ మన్ కు రూ.4.8 కోట్లు పలకడం విశేషం. అతడిని పంజాబ్ తీసుకుంది. వెస్టిండీస్ ఆటగాళ్లు నికోలస్ పూరన్.. హెట్మెయర్ రూ.4.2 కోట్ల చొప్పున ధర పలికారు. పుజారా.. నమన్ ఓజా.. వినయ్ కుమార్ లాంటి భారత ఆటగాళ్లతో పాటు డేల్ స్టెయిన్.. బ్రెండన్ మెక్ కలమ్.. మోర్నీ మోర్కెల్ లాంటి విదేశీయులు వేలంలో అమ్ముడవలేదు.