తను అలక వహించినట్టుగా.. రాజకీయ కార్యకలాపాలకు దూరంగా ఉన్నట్టుగా తెలుగుదేశం అనుకూల మీడియా ప్రచారం ఊపందుకునేలా చేయడంపై స్పందించారు ఒంగోలు మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి. జగన్ కు బాబాయ్ అయ్యే వైవీ సుబ్బారెడ్డి.. అలక వహించారని - ఒంగోలు ఎంపీ టికెట్ ఆయనకు దక్కకపోవడంపై అసహనంతో ఉన్నారని - అందుకే పార్టీ కార్యకలాపాలకు పూర్తిగా దూరంగా ఉన్నారని తెలుగుదేశం అనుకూల మీడియా ప్రచారం చేస్తూ ఉంది. ఈ విషయంలోవార్తలను పతాక శీర్షికల్లో వేసింది టీడీపీ మీడియా.
ఈ నేపథ్యంలో వైవీ సుబ్బారెడ్డి స్పందించారు. తను వ్యక్తిగత కారణాలతో విదేశాలకు వెళ్లిన మాట వాస్తవమే అని - అయితే పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉండటం మాత్రం నిజం కాదని ఆయన అన్నారు. తను అలక వహించడం పూర్తిగా అబద్ధమని తేల్చి చెప్పారు. తను పార్టీలో ఉన్నట్టేనని.. పార్టీ కార్యకలాపాల్లో పాలుపంచుకుంటున్నట్టుగా వైవీ పేర్కొన్నారు.
తనకు ప్రత్యక్ష రాజకీయాలు అంటే ఆసక్తి అని, అందుకే తను ఒంగోల్లో మళ్లీ పోటీ చేయాలని అనుకున్నట్టుగా వైవీ వివరించారు. అయితే పార్టీ తనకు ఆ అవకాశం ఇవ్వలేదని.. అది నిరాశను కలిగించే అంశమే అయినా, పార్టీ కోసం పాటు పడుతున్నట్టుగా వైవీ పేర్కొన్నారు. జగన్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాల్సిన అవసరం ఎంతైనా ఉందని, అందు కోసం తను పాటు పడుతూ ఉన్నట్టుగా వైవీ ప్రకటించారు.
తనకు ఎంపీ టికెట్ కేటాయించని జగన్ రాజ్యసభ సభ్యత్వాన్ని ఆఫర్ చేశారని, అయితే తనకు ప్రత్యక్ష రాజకీయాలే ఆసక్తి అని ఈ సందర్భంగా వైవీ పేర్కొన్నారు. తను అలిగినది మాత్రం ఏమీ లేదని.. తను పార్టీ కోసమే శ్రమిస్తున్నట్టుగా వైవీ స్పష్టం చేశారు.