ఇది పాక్ వైమానిక దళం ముందు జాగ్రత్తా?

Update: 2016-09-23 08:27 GMT
భారత్ - పాకిస్థాన్ మధ్య సంబంధాలు, కశ్మీర్ పరిస్థితులు యురి ఉగ్రదాడికి ముందూ, యురి ఉగ్రదాడి తర్వాత అనేంతగా మారిపోయాయి అని అంటే అది అతిశయోక్తి కాదేమో. యురి ఉగ్రదాడి అనంతరం పాక్ విషయంలో భారత్ చాలా సీరియస్ గా ఉందని, సైనిక చర్యా లేక దౌత్య చర్యలతో పాక్ కు గట్టిగా బుద్ది చెప్పాలని భారత్ యోచిస్తుందని ఇప్పటికే వార్తలు వస్తున్నాయి. ఈ సమయంలో పాక్ ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటుందా? ఆ క్రమంలోనే ఎయిర్ డిఫెన్స్ డ్రిల్ చేస్తుందా? అంటే అవుననే సంకేతాలతో కూడిన సమాధానాలు వస్తున్నాయి!

భారత్ - పాకిస్థాన్ దేశాల మధ్య ప్రస్తుత పరిస్థితులు ఉద్రిక్తతలుగా ఉన్న నేపథ్యంలో... "ఇస్లామాబాద్ మీదుగా ఆకాశంలో ఎఫ్-16 యుద్ధ విమానాలు ఎగురుతున్నాయి" అని పాకిస్థాన్ పాత్రికేయుడు చేసిన ఒక ట్వీట్ కలకలం రేపింది. జియో టీవీలో పనిచేసే హమీద్ మీర్ అనే జర్నలిస్టు ఈ విషయాన్ని తన ట్విట్టర్ ద్వారా తెలిపాడు. ఈ ట్వీట్ కు బలం చేకూరుస్తూ... తాను కూడా పెద్ద శబ్దం విన్నట్లు ట్వీట్ చేశాడు రాణా మహ్మద్ ఉస్మాన్ అనే మరో వ్యక్తి. ఇదే సమయంలో దక్షిణాసియా దేశాల్లో ఉన్న ప్రజలకు యుద్ధాలు మంచివి కావని, యుద్ధ కాంక్షను ఆపాలని మరో ట్వీట్ చేశాడు ఆ జర్నలిస్టు. దీంతో ఒక్కసారిగా ఈ ట్వీట్ కలకలం రేపింది. ఇది చాలదన్నట్లు... "ఏ క్షణంలో యుద్ధం వచ్చినా తాము సిద్ధంగా ఉన్నామని, ఎవరూ ఆందోళన చెందొద్దని చెప్పడం కోసమే పాక్ దళాలే విమానంతో విన్యాసాలు చేశాయి" అని ట్వీట్‌ చేశాడు మరో వ్యక్తి.

ఈ ట్వీట్లు, పరిస్థితులను బట్టి చూస్తే.. ముందు జాగ్రత్త చర్యలో లేక తానే ముందుగా కాళుదువ్వాలనో కానీ పాకిస్థాన్ మెంటల్ గా రెడీ అవుతుందని అంటున్నారు విశ్లేషకులు. ఆ చర్యల్లో భాగంగానే పాక్ వైమానిక దళం ముందు జాగ్రత్తగా ఎయిర్ డిఫెన్స్ డ్రిల్ చేసి ఉంటుందని అభిప్రాయపడుతున్నారు. అయితే.. ఈ విషయంపై పాక్ జర్నలిస్టూ, ఇతర వ్యక్తుల స్పందనే తప్ప అధికారిక ప్రకటనలు ఏవీ వెలువడలేదు.
Tags:    

Similar News