అప్పటి కాల్పులకు ఇప్పుడు ఫీలవుతున్నాడట

Update: 2016-01-25 04:16 GMT
ఎన్నికలకు ముందు.. ఆ తర్వాత అన్నట్లుగా ఉంటాయి రాజకీయ నేతల మాటలు. ఎన్నికలు ముంచుకొచ్చే వేళ.. అన్ని వర్గాల మనసుల్ని దోచుకునేందుకు పలువురు నేతలు విపరీతంగా ప్రయత్నిస్తుంటారు. తాజాగా సమాజ్ వాది పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్ మాటల్ని వింటే ఇదెంత నిజమన్న సంగతి ఇట్టే అర్థమవుతుంది. అప్పుడెప్పుడో పాతికేళ్ల కిందట జరిగిన ఘటనపై ములాయం తాజాగా తన బాధను వ్యక్తం చేయటం గమనార్హం.

అయోధ్యలో 1990లో కరసేవకులపై కాల్పులు జరిగిన ఉదంతంపై ఆయనిప్పుడు తెగ ఫీలవుతున్నారు. కరసేవకులపై కాల్పులకు ఆదేశాలివ్వటం తనను బాధకు గురి చేస్తుందని.. కానీ.. మతపరంగా ఎంతో ప్రాధాన్యత ఉన్న కట్టడాన్ని కాపాడేందుకు అప్పట్లో ఆదేశాలు ఇవ్వటం తప్పలేదని వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. సదరు కాల్పుల గురించి నాటి ప్రతిపక్ష నేత అటల్ బిహారి వాజ్ పేయ్ పార్లమెంటులో ప్రస్తావించారని.. తప్పనిసరి పరిస్థితుల్లోనే తాను కాల్పులకు ఆదేశాలు ఇచ్చినట్లుగా పేర్కొన్నట్లుగా ములాం వెల్లడించారు. మరికొద్ది నెలల్లో సార్వత్రిక ఎన్నికలు వస్తున్న వేళ.. ఇలాంటి బాధకు సంబంధించిన చాలానే మాటలు వస్తాయేమో.
Tags:    

Similar News