అమ్మకానికి గుజరాత్ టైటాన్స్?... రేసులో ఆ రెండు కంపెనీలు!
ఈ మేరకు సివీసీ క్యాపిటల్స్ పార్ట్ నర్స్... అదానీ గ్రూప్, టొరెంట్ గ్రూప్ లతో చర్చలు జరుపుతున్నట్లు ది ఎకనామిక్స్ టైమ్స్ నివేదించింది.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) - 2024 సీజన్ లో ఆడిన 14 మ్యాచ్ లలోనూ ఐదు మ్యాచ్ లు గెలిచి 12 పాయింట్లతో ఎనిమిదో స్థానంలో నిలిచిన గుజరాత్ టైటాన్స్ వాటా అమ్మకానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఈ మేరకు సివీసీ క్యాపిటల్స్ పార్ట్ నర్స్... అదానీ గ్రూప్, టొరెంట్ గ్రూప్ లతో చర్చలు జరుపుతున్నట్లు ది ఎకనామిక్స్ టైమ్స్ నివేదించింది.
అవును... అదానీ లేదా టొరెంట్ గ్రూప్ లకు గుజరాత్ టైటన్స్ లో సింహభాగం షేర్ ను విక్రయించాలని ప్రస్తుత యాజమాన్యం సీవీసీ క్యాపిటల్ పార్ట్ నర్స్ యోచిస్తుందట. మైనారిటీ హోల్డింగ్స్ ను మాత్రమే తమవద్ద ఉంచుకోవాలని సీవీసీ భావిస్తుందని.. అందుకు సిద్ధంగా ఉందని.. ఈ మేరకు సమాచారం అందిందని సదరు మీడియా సంస్థ వెల్లడించింది.
వాస్తవానికి కొత్త జట్ల వాటాలను విక్రయించకుండా నిరోధించే భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) నిర్ధేశించిన లాక్ ఇన్ వ్యవధి వచ్చే ఏడాది ఫిబ్రవరితో ముగుస్తుంది. ఇక మూడు సంవత్సరాల ఫ్రాంచైజీ విలువ ఒక బిలియన్ డాలర్ నుంచి ఒకటిన్నర బిలియన్ డాలర్ల మధ్య ఉంటుందని చెబుతున్నారు. కాగా... సీవీసీ 2021లో ఈ ఫ్రాంచైజీని రూ.5,625 కోట్లకు కొనుగోలు చేసింది.
2021లోనే ఐపీఎల్ లో అహ్మదాబాద్ ఫ్రాంచైజీని సొంతం చేసుకునే అవకాశాన్ని అదానీ, టొరెంట్ లు కోల్పోయాయని.. ఈ నేపథ్యంలో గుజరత్ టైటాన్స్ లో మెజారిటీ వాటాను కొనుగోలు చేసేందుకు వారు ఆసక్తిగానే ఉన్నారని.. ఫ్రాంచైజ్ లో దాని వాటాను మోనిటైజ్ చేయడానికి సీవీసీకి ఇది మంచి అవకశమని నిపుణులు చెబుతున్నారు!
మరోపక్క ఇప్పటికే అదానీ మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్), యూఏఈ ఆధారిత ఇంటర్నేషనల్ లీగ్ టీ20 జట్లను కొనుగోలు చేయడంద్వారా క్రికెట్ లో పెట్టుబడులు పెట్టారు. ఇందులో భాగంగానే డబ్ల్యూపీఎల్ 2023లో అహ్మదాబాద్ ఫ్రాంచైజీని రూ.1,289 కోట్ల టాప్ బిడ్ తో దక్కించుకున్నారు! ఈ నేపథ్యంలో జీటీని దక్కించుకునే అవకాశాలున్నాయని అంటున్నారు!