మరో టీమ్ ఇండియా క్రికెట్ స్టార్ రిటైర్మెంట్? టెస్టులకా? మొత్తానికా?

అయితే, వీరితో పాటు స్టార్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా కూడా రిటైర్మెంట్ బాటలో కొనసాగుతున్నాడు.

Update: 2025-01-11 12:30 GMT

అతడు విరాట్ కోహ్లి, రోహిత్ శర్మలతో కెరీర్ ప్రారంభించాడు.15 ఏళ్లుగా టీమ్ ఇండియాలో భాగంగా ఉన్నాడు. బౌలింగ్ తో ఆకట్టుకుని, బ్యాటింగ్ లో రాణించడమే కాదు.. ఫీల్డింగ్ లో అదరగొడుతూ మ్యాచ్ విన్నర్ స్థాయికి ఎదిగాడు. ఒకటీ రెండు కాదు 300 పైగా మ్యాచ్ లలో మూడు ఫార్మాట్లలోనూ కీలకంగా మారాడు. అయితే, ఎంతటి క్రికెటర్ అయినా రిటైర్ కావాల్సిందేగా..? వయసు మీద పడుతుంది.. ఆటలో చురుకు తగ్గుతుంది.. కుర్రాళ్లు దూసుకొస్తుంటారు. ఇప్పుడు ఆ స్టార్ క్రికెటర్ విషయంలోనూ అదే జరుగుతోంది.


టీమ్ ఇండియా స్టార్ క్రికెటర్లు విరాట్ కోహ్లి, కెప్టెన్ రోహిత్ శర్మ ఇప్పటికే టి20లకు రిటైర్మెంట్ ఇచ్చారు. వీరి వన్డే కెరీర్ భవిష్యత్ కూడా ఫిబ్రవరిలో జరిగే చాంపియన్స్ ట్రోఫీ అనంతరం

తేలిపోనుంది. అయితే, వీరితో పాటు స్టార్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా కూడా రిటైర్మెంట్ బాటలో కొనసాగుతున్నాడు. ఇప్పటికే రోహిత్, కోహ్లిలతో పాటే టి20 ప్రపంచ కప్ అనంతరం ఆ ఫార్మాట్ నుంచి జడేజా వైదొలగాడు. ఇప్పుడు టెస్టుల నుంచి కూడా తప్పుకొంటాడా? అనే సంకేతాలు చ్చాడు.

ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్‌లో జడేజా విఫలమయ్యాడు. 3 మ్యాచ్‌ లలో నాలుగు వికెట్లే తీశాడు. 27 సగటుతో 135 పరుగులు చేశాడు. అన్నిటికి మించి బంతిని స్పిన్ చేయలేకపోతున్నాడు. బౌలింగ్‌ లో వైవిధ్యం కొరవడింది. స్వదేశంలో న్యూజిలాండ్‌ తో సిరీస్‌ లోనూ విఫలమయ్యాడు. దీంతో జట్టుకు జడేజా అవసరం ఉందా? అని అంటున్నారు. సిడ్నీలో చివరగా ఆడిన టెస్టులో వేసుకున్న తన జెర్సీ ఫొటోను ఇన్‌ స్టా గ్రామ్‌ లో పోస్ట్ చేశాడు. దీంతో టెస్టులకు అతడు గుడ్‌ బై చెప్పేశాడా? అనే చర్చ జరుగుతోంది.

వన్డేలకూ ఔటా..?

వన్డేలకు జడేజా కొనసాగింపు కూడా అనుమానమే. ఇప్పటికే గత జూలైలో జరిగిన శ్రీలంక టూర్ కు అతడిని ఎంపిక చేయలేదు. ఇప్పుడు చాంపియన్స్ ట్రోఫీకి ఎంపిక చేస్తారా? అనే సందేహం నెలకొంది. హెడ్ కోచ్‌ గంభీర్‌ 2027 వన్డే ప్రపంచ కప్‌ కోసం యువ జట్టును సిద్ధం చేసే పనిలో ఉన్నాడు. దీంతో సీనియర్లకు చెక్ పడినట్లే. అంటే వన్డేల్లో రోహిత్, కోహ్లితో పాటు జడేజా కూడా రిటైర్ కావడం ఖాయం.

వాస్తవానికి ఏడాది నుంచి ఏ ఫార్మాట్లోనూ జడేజా ఫామ్‌ అంత గొప్పగా లేదు. చాంపియన్స్‌ ట్రోఫీలో భారత్‌ ఆడే మ్యాచ్‌ లు యూఏఈ పిచ్‌ లు స్పిన్‌ కు అనుకూలిస్తాయి. బహుశా జడేజాకు ఇదే వన్డే సిరీస్ కావొచ్చు. మిడిల్ ఆర్డర్లో అనుభవం ఉన్న ఆటగాడు కావడంతో జడేజాకు మరో అవకాశం దక్కే సూచనలున్నాయి. ఆ తర్వాత మాత్రం టెస్టులు, వన్డేలకూ రిటైర్ కావడం ఖాయమని అంటున్నారు.

Tags:    

Similar News