ముంబైలో సూర్యకుమార్ యాదవ్ లగ్జరీ ఫ్లాట్స్... ధర ఎంతంటే..?
ఈ నేపథ్యంలో సూర్యకుమార్ యాదవ్ తాజాగా ముంబైలో రెండు అపార్ట్ మెంట్ లను కొనుగోలు చేసిన విషయం తెరపైకి వచ్చింది.;

టీమిండియా క్రికెటర్ల మైదానంలో సంపాదన, బయట ప్రకటనల వల్ల వచ్చే ఆదాయం దాదాపు అన్ని క్రికెట్ బోర్డుల ఆటగాళ్ల కంటే ఎక్కువని అంటారు. దీంతో.. వారి లైఫ్ స్టైల్ కూడా దానికి తగ్గట్లే ఉంటుందని చెబుతారు. ఈ నేపథ్యంలో సూర్యకుమార్ యాదవ్ తాజాగా ముంబైలో రెండు అపార్ట్ మెంట్ లను కొనుగోలు చేసిన విషయం తెరపైకి వచ్చింది.
అవును... టీమిండియా టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, అతని భార్య దేవీషా యాదవ్.. ముంబైలోని డియోనార్ ప్రాంతంలోని గోద్రేజ్ స్కై టెర్రసెస్ లో రెండు అపార్ట్ మెంట్ లను కొనుగోలు చేశారు. వీటిని రూ.21.1 కోట్లకు కొనుగోలు చేసినట్లు చెబుతున్నారు. ఇనిస్పెక్టర్ జనరల్ ఆఫ్ రిజిస్ట్రేషన్ వెబ్ సైట్ లో ఆస్తి రిజిస్ట్రేషన్ పత్రాల ప్రకారం ఇది తెలిసింది!
ఈ గోద్రేజ్ స్కై టెర్రస్ ప్రాజెక్ట్ లోని అపార్ట్ మెంట్ లను ఈ నెల 21న రిజిస్ట్రేషన్ చేయగా.. వరుసగా రెండు అంతస్తులలో రెండు ప్లాట్లను కొనుగోలు చేశారు. ఈ మొత్తం కార్పెట్ ప్రాంతం విలువ సుమారు 4,222.7 చదరపు అడుగులు, మొత్తం ప్రాంతం 4,568 చదరపు అడుగులుగా ఉంది!
ఇక.. ఈ అగ్రిమెంట్ లో మొత్తం ఆరు రిజర్వ్డ్ కారు పార్కింగ్ స్థలాలు ఉండగా.. ఈ లావాదేవీకి స్టాంప్ డ్యూటీ రూ.1.26 కోట్లు కాగా.. రిజిస్ట్రేషన్ ఫీజు రూ.30,000!
కాగా... ప్రస్తుతం సూర్యకుమార్ యాదవ్ ఐపీఎల్ లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ముంబై ఇండియన్స్ టీమ్ తరుపున ఆడుతున్నాడు. ఈ క్రమంలో ఐపీఎల్ కెరీర్ లో మొత్తం 151 మ్యాచ్ లు ఆడిన "స్కై"... 32.35 యావరేజ్ తో 144.98 స్ట్రైక్ రేట్ తో 3,623 పరుగులు చేశాడు.
ఇందులో రెండు సెంచరీలు, 24 అర్థ సెంచరీలు ఉన్నాయి. ఇలా బ్యాటర్ గా 387 ఫోర్లు, 131 సిక్స్ లు బాదిన సూర్యకుమార్ యాదవ్.. ఫీల్డింగ్ లో 68 క్యాచ్ లు అందుకున్నాడు. ఇదే క్రమంలో ప్రస్తుతం టీమిండియా టీ20 జట్టుకు కెప్టెన్ గా వ్యవహరిస్తూ... 77.27 విన్నింగ్ పర్సంటేజ్ తో సక్సెస్ ఫుల్ సారథిగా ఉన్నాడు!