వరల్డ్ కప్ ఎఫెక్ట్... పాక్ కోసం రంగంలోకి ఆ ఇద్దరూ!
ఈ క్రమంలో ఇప్పటికే మాజీ క్రికెటర్లు మహ్మద్ హఫీజ్ ను డైరెక్టర్ ఆఫ్ క్రికెట్ గా నియమించిన పీసీబీ.. ఇంజిమాం ఉల్ హుక్ ను తప్పించి వహాబ్ రియాజ్ ను చీఫ్ సెలక్టర్ గా ఎంపిక చేసింది.
వన్ డే వరల్డ్ కప్ - 2023లో పాకిస్థాన్ ప్రదర్శనపై తీవ్ర విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ విషయంలో పాక్ ప్లేయర్లను విమర్శించడానికి అభిమానులు, మాజీలు, విశ్లేషకులూ పోటీ పడ్డారన్నా అతిశయోక్తి కాదేమో. ఎవరికి వారు ఆన్ లైన్ వేదికగా కొందరు.. టీవీ డిబెట్ లలో ఇంకొందరు పాక్ టీం పై ఫైరయ్యారు. ఆఖరికి ఆటపై నిబద్దత, గౌరవం లేని టీం గా కన్ క్లూజన్ కి వచ్చారు.
ఈ సమయంలో ముందు జాగ్రత్త చర్యల్లో భాగమో.. లేక, తప్పు తెలుసుకుని తనకు తాను వేసుకున్న శిక్ష ఫలితమో తెలియదు కానీ.. కేప్టెన్సీకి రాజీనామా చేశాడు ఈ వరల్డ్ కప్ లో పాక్ సారథి బాబర్ ఆజాం. అక్కడ నుంచి మొదలు పాక్ బోర్డు వరుసగా మార్పులు చేసుకుంటూ పోతుంది. సీనియర్ జూనియర్ అనే తేడాలేకుండా పెర్ఫార్మెన్స్ లేని వ్యక్తిని పక్కన కూర్చోబెడుతుంది.
ఈ క్రమంలో ఇప్పటికే మాజీ క్రికెటర్లు మహ్మద్ హఫీజ్ ను డైరెక్టర్ ఆఫ్ క్రికెట్ గా నియమించిన పీసీబీ.. ఇంజిమాం ఉల్ హుక్ ను తప్పించి వహాబ్ రియాజ్ ను చీఫ్ సెలక్టర్ గా ఎంపిక చేసింది. ఇలా పాలనా విభాగం, శిక్షణా సిబ్బంది ఎంపిక విషయంలో సీనియర్లు, జూనియర్లు అనే తారతమ్యాలేమీ లేకుండా... కీలక నిర్ణయాలు తీసుకుంటూ సమూల మార్పులు చేస్తుంది.
ఇలా ఇప్పటికే టెస్టు పగ్గాలను షాన్ మసూద్ కు, టీ20 పగ్గాలు పేసర్ షాహిన్ ఆఫ్రిది కి అప్పగించిన పీసీబీ... తాజాగా ఇద్దరు బౌలింగ్ కోచ్ లను తమ కోచింగ్ స్టాఫ్ లో చేర్చుకుంది. ఇందులో భాగంగా... ఉమర్ గుల్, సయీద్ అజ్మల్ లకు బౌలింగ్ కోచ్ లుగా అవకాశం ఇచ్చింది. వీరిద్దరు డిసెంబరులో ఆస్ట్రేలియా పర్యటన సందర్భంగా బాధ్యతలు చేపట్టనున్నారు.
ఫాస్ట్ బౌలింగ్ విభాగానికి కోచ్ గా సేవలు అందించనున్న గుల్... పాకిస్తాన్ తరఫున 2003లో నుంచి 2016 వరకూ అంతర్జాతీయ మ్యాచ్ లు ఆడాడు. ఈ క్రమంలో తన కెరీర్ లో 47 టెస్టుల్లో 163, 130 వన్డేల్లో 179, 60 టీ20లలో 85 వికెట్లు పడగొట్టాడు. ఇక స్పిన్ బౌలింగ్ విభాగానికి కోచ్ గా ఉండనున్న అజ్మల్... తన కెరీర్ లో 35 టెస్టుల్లో 178, 113 వన్డేల్లో 184, 64 టీ20 మ్యాచ్ లలో 85 వికెట్లు పడగొట్టాడు.
కాగా భారత్ వేదికగా జరిగిన ఐసీసీ వన్ డే వరల్డ్ కప్ టోర్నీలో పాకిస్తాన్ దారుణ వైఫల్యంతో విమర్శల పాలైన విషయం తెలిసిందే. ప్రధానంగా ఫేవరెట్లలో ఒకటిగా బరిలోకి దిగిన పాక్ టీం... వరుస ఓటముల కారణంగా సెమీస్ కూడా చేరకుండానే నిష్క్రమించింది. టోర్నీలో ఎంట్రీ ఇచ్చిన మొదటి మూడు మ్యాచ్ లూ బాగానే ఆడిన పాక్... భారత్ తో జరిగిన మ్యాచ్ అనంతరం ఆ దెబ్బనుంచి కోలుకోలేకపోయింది. ఈ నేపథ్యంలో బాబర్ ఆజం కెప్టెన్సీ నుంచి తప్పుకోగా.. బౌలింగ్ కోచ్ గా మోర్నీ మోర్కెల్ తన విధుల నుంచి వైదొలిగాడు