హిట్ సినిమా ని హీరో ఇమేజ్ డ్యామేజ్ చేస్తోందా?
అయితే ఈ సినిమాకి అక్కడ ఏమాత్రం బజ్ కనిపించడం లేదు. కనీస బుకింగ్స్ కూడా అవ్వడం లేదని టాక్ వినిపిస్తుంది.
హిట్ సినిమాని హీరో ఇమేజ్ డ్యామేజ్ చేస్తోందా? కనీస ఓపెనింగ్స్ కూడా కష్టంగా కనిపిస్తుందా? అంటే సన్నివేశం అలాగే కనిపిస్తుంది. సూర్య నటించిన కోలీవుడ్ చిత్రం 'ఆకాశం నీ హద్దురా' ఎలాంటి విజయం సాధించిందో తెలిసిందే. విమర్శకుల ప్రశంలతో పాటు జాతీయ అవార్డు సైతం అందుకుని గొప్ప చిత్రంగా నిలిచింది. సామాన్యుడిని విమానం ఎక్కించాలనే తపనని ఎంతో హృద్యంగా సుధకొంగర తెరకెక్కించారు. సూర్య నటన...సుధ మేకింగ్ సినిమాని నెక్స్ట్ లెవల్ కి తీసుకెళ్లాయి.
ఇదే చిత్రాన్ని హిందీలో అక్షయ్ కుమార్ తో 'సర్పిలా' టైటిల్ తో సుధ కొంగర రీమేక్ చేసిన సంగతి తెలిసిందే. అన్ని పనులు పూర్తి చేసుకున్న సినిమా జులై 12న రిలీజ్ అవుతుంది. అయితే ఈ సినిమాకి అక్కడ ఏమాత్రం బజ్ కనిపించడం లేదు. కనీస బుకింగ్స్ కూడా అవ్వడం లేదని టాక్ వినిపిస్తుంది. సాధారణంగా స్టార్ హీరో సినిమా సినిమా రిలీజ్ అంటే ఎంత వ్యతిరకత ఉన్నా మినిమం బుకింగ్స్ అనేవి ఉంటాయి.
'లాల్ సింగ్ చడ్డా' రిలీజ్ కి ముందు అమీర్ ఖాన్ పై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైనా మినిమం అడ్వాన్స్ బుకింగ్స్ అయితే జరిగాయి. కానీ అక్షయ్ విషయంలో మాత్రం అది కూడా కనిపించలేదు. అది హిట్ కంటెంట్ కి లేకపోవడం అందర్నీ ఆశ్చర్యపరుస్తోన్న విషయం. అయితే అందుకు కారకుడు అక్షయ్ అనే టాక్ బలంగా వినిపిస్తుంది. అక్షయ్ వరుస వైఫల్యాలే అడ్వాన్స్ బుకింగ్స్ పై తీవ్ర ప్రభావం పడినట్లు టాక్ వినిపిస్తుంది.
'ఆత్రంగిరే' తర్వాత అక్షయ్ నటించిన పది సినిమాలు రిలీజ్ అయ్యాయి. వాటిలో ఏ ఒక్కటి విజయం సాధించలేదు. ఈ క్రమంలో అక్షయ్ తీవ్ర విమర్శలు ఎదుర్కున్నాడు. ఇటీవలే రిలీజ్ అయిన 'బడేమియాన్ చోటే మియాన్' పరాజయంతో ఏకంగా నిర్మాత దివాళా తీసే పరిస్థితి వచ్చింది. సొంత ఆపీస్ అమ్ముకుని అప్పులు తీర్చాల్సిన పరిస్థితి తలెత్తింది. ఇవన్నీ కలిసి ఇప్పుడు 'సర్పిలా' పై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తున్నాయి. ఓ హిట్ సినిమాకి ఇలా జరగడం అన్నది దురదృష్టకరం. ఆడియన్స్ కనీసం థియేటర్ కి వెళ్లే సన్నివేశం కనిపించలేదు. ఈ నేపథ్యంలో సినిమా తొలి షో తర్వాత వచ్చే టాక్ జనాల్ని థియేటర్ కి తీసుకెళ్లాల్సి ఉంటుంది. అదే జరిగితే బాలీవుడ్ చరిత్రలో నిలిచిపోయే సినిమా అవుతుంది.