ఈ మధ్య కాలంలో విమాన ప్రమాదాలు పెరిగిపోయాయి. ఎయిర్‌పోర్ట్ రన్‌వేల మీద ల్యాండ్ కావాల్సిన విమానాలు.. రోడ్ల మీద.. పార్కుల్లో ల్యాండ్ కావటం తలెఇసిందే. మరోవైపు చిన్న చిన్న విమానాలు సాంకేతిక లోపం కారణంగా కూలిపోవటం.. పలువురు ప్రాణాలు కోల్పోయేలా చేయటం తెలిసిందే.
ఈ కోవలో తాజాగా మరో విమాన ప్రమాదం చోటు చేసుకుంది. ఒక బుల్లి విమానం.. అమెరికాలో ఒక ఇంట్లోకి దూసుకెళ్లింది. అమెరికాలోని మాసాచూసెట్స్ రాష్ట్రంలోని ప్లెయిన్ విల్లే అనే పట్టణంలో.. నలుగురు ప్రయాణించే తేలికపాటి విమానం ఒకటి ప్రమాదవశాత్తు ఇంట్లోకి దూరిపోయింది.
అదృష్టం బాగుండి.. విమానంలో ప్రయాణిస్తున్న వారు బతికి బట్టకట్టిన పరిస్థితి. దీనిపై అధికారులు కేసు నమోదు చేసుకొని విచారిస్తుంటే.. ఈ ఘటన జరిగిన ప్రాంతంలోని ప్రజలు మాత్రం భయంతో బిక్కచచ్చిపోయారు. జరిగింది ప్రమాదమైనా.. ఏదైనా తీవ్రవాదుల దాడి జరిగిందా? అన్న సందేహంతో వారు వణికిపోయారు. ఇవాల్టి రోజున ఏ విషయాన్ని తేలిగ్గా తీసుకోలేని నేపథ్యంలో.. ఈ ఘటన ఆందోళనను రేకెత్తించటాన్ని అర్థం చేసుకోవచ్చు.