అమెరికాలో జన్మత: పౌరసత్వంపై ట్రంప్ ఆదేశాన్ని రద్దుచేసిన కోర్టు
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇచ్చిన జన్మసిద్ధ పౌరసత్వాన్ని పరిమితం చేసే ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ పై కోర్టు కీలక నిర్ణయం తీసుకుంది.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇచ్చిన జన్మసిద్ధ పౌరసత్వాన్ని పరిమితం చేసే ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ పై కోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. అక్రమ వలసదారులు , తాత్కాలిక వీసాపై వచ్చినవారికి అమెరికాలో జన్మించిన పిల్లలకు పౌరసత్వాన్ని నిలిపివేసే ట్రంప్ ఆదేశాన్ని తిరిగి అమలులోకి తేవాలని న్యాయ విభాగం చేసిన విజ్ఞప్తిని అమెరికా 9వ సర్క్యూట్ కోర్టు తిరస్కరించింది.
- న్యాయ పోరాటం
ఈ కేసులో ట్రంప్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అమెరికా రాజ్యాంగంలోని 14వ సవరణకి వ్యతిరేకమని న్యాయ నిపుణులు పేర్కొన్నారు. ఈ సవరణ ప్రకారం అమెరికాలో జన్మించిన ప్రతి వ్యక్తికి స్వయంచాలకంగా పౌరసత్వ హక్కు లభిస్తుంది. అయితే దీనిపై ట్రంప్ ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌ను తెచ్చింది.
-ట్రంప్ ఉత్తర్వులను రద్దు చేసిన కోర్టు
ట్రంప్ ఇచ్చిన ఆదేశాన్ని దిగువ కోర్టు నిలిపివేయగా, దాన్ని మళ్లీ అమలు పరచాలని న్యాయ శాఖ అత్యవసరంగా కోర్టును ఆశ్రయించింది. అయితే 9వ సర్క్యూట్ కోర్టు దీనిని తిరస్కరించింది. ఈ కేసు ఇంకా న్యాయపరమైన పరిశీలనలో ఉందని, ప్రస్తుతానికి దిగువ కోర్టు ఇచ్చిన తీర్పే అమలులో ఉంటుందని కోర్టు స్పష్టం చేసింది.
-రాజకీయ ప్రతిస్పందనలు
ఈ తీర్పుపై ట్రంప్ అనుకూల వర్గాలు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నాయి. మరొకవైపు, డెమొక్రటిక్ పార్టీకి చెందిన నాయకులు దీనిని రాజ్యాంగ విజయంగా కొనియాడుతున్నారు. జన్మనిచ్చే పౌరసత్వ హక్కును పరిమితం చేయాలనే ట్రంప్ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు ప్రతిపక్ష నాయకులు పేర్కొన్నారు.
- ఈ తీర్పుతో ఏం జరుగనుంది?
ఈ తీర్పుతో ట్రంప్ ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించే అవకాశం ఉంది. మరోవైపు, అమెరికాలో వలస విధానాలపై ట్రంప్ తీసుకుంటున్న కఠిన నిర్ణయాలు రాజకీయంగా ప్రాధాన్యం పొందుతున్నాయి. ఈ అంశంపై తుది తీర్పు వచ్చే వరకు ఈ వివాదం కొనసాగుతుందని నిపుణులు భావిస్తున్నారు.