ఆర్ఎస్ఎస్ మీద సంచలన వ్యాఖ్యలు చేసిన మోడీ

తాజాగా ఆదివారం మహారాష్ట్రలోని ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యాలయాన్ని నరేంద్ర మోడీ సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన ఆర్ఎస్ఎస్ గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు.;

Update: 2025-03-30 17:30 GMT
PM Narendra Modi Visit RSS Bhavan

ప్రధాని మోడీ ఆర్ఎస్ఎస్ మీద తన అభిమానాన్ని ఘనంగా చాటుకున్నారు. ఆర్ఎస్ఎస్ ని చాలా గొప్పగా అభివర్ణించారు. ఆర్ ఎస్ ఎస్ మీద ఇటీవల కాలంలో విపక్షాలు పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్నాయి. మేధావులు రాజకీయాల ముద్ర లేని తటస్థులు కూడా ఆర్ఎస్ఎస్ ని విమర్శిస్తున్నారు. ఈ మధ్యనే మహాత్మా గాంధీ ముని మనవడు అయిన తరుణ్ గాంధీ కూడా ఆర్ఎస్ఎస్ ప్రమాదకరం అని వ్యాఖ్యానించినట్లుగా వార్తలు వచ్చాయి.

ఇలా ఆర్ఎస్ఎస్ మీద ప్రత్యర్ధులు ఎన్ని విమర్శలు చేసినా ఆర్ ఎస్ ఎస్ తన పని తాను చేసుకుంటూ పోతుంది. ఆర్ఎస్ఎస్ నుంచి ప్రతి విమర్శలు అయితే ఉండవు. కానీ ఈ దేశాన్ని పాలించే బీజేపీ ఆర్ఎస్ఎస్ మూలాలను కలిగి ఉన్న సంగతి తెలిసిందే. ఆర్ఎస్ఎస్ సేవక్ గా దీర్ఘ కాలం పనిచేసిన వారు నరేంద్ర మోడీ. ఆయన ఈ రోజున దేశానికి ప్రధానిగా ఉన్నారు.

ఆయన వీలు దొరికినపుడల్ల ఆర్ఎస్ఎస్ కార్యక్రమాల్లో పాలు పంచుకుంటారు. ఆర్ఎస్ఎస్ ని ఆయన పెద్ద ఎత్తున ప్రశంసిస్తారు. తాజాగా ఆదివారం మహారాష్ట్రలోని ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యాలయాన్ని నరేంద్ర మోడీ సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన ఆర్ఎస్ఎస్ గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఆర్ఎస్ఎస్ అన్నది భారతీయ సజీవ సంస్కృతికి ఆధునిక అక్షయ వట వృక్షంగా మోడీ అభివర్ణించారు. భారతీయ సంస్కృతికి ఆధునీకరణకు ఆర్ఎస్ఎస్ వట వృక్షం లాంటిది అని ఆయన అన్నారు. ఇటీవల ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగ్ రాజ్ లో ముగిసిన మహా కుంభ మేళాలో ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు చేసిన సేవ నిస్వార్ధమైనది అని మోడీ కొనియాడారు.

ఆర్ఎస్ఎస్ చేసిన తపస్సు ఈ రోజున దేశం వికసిత్ భారత్ దిశగా ముందుకు సాగుతూ మంచి ఫలాలు ఫలితాలు ఇస్తోంది అని మోడీ అన్నారు. మోడీ ప్రధాని అయిన తరువాత ఆర్ఎస్ఎస్ తో గ్యాప్ ఉందని గతంలో ప్రచారం జరిగింది. కానీ అలాంటిది ఏమీ లేదని సందర్భం వచ్చిన ప్రతీ సారీ ఆయన చాటుకుంటూనే ఉన్నారు.

తాజాగా నాగపూర్ లోని ఆర్ఎస్ఎస్ ప్రధాన ఆఫీసుకి మోడీ రావడం విశేషంగానే చూస్తున్నరు ఇక బీజేపీకి దిశా నిర్దేశం చేస్తూ ఈ దేశాన్ని అన్ని విధాలుగా ముందుకు తీసుకుని వెళ్ళాలని ఆర్ఎస్ఎస్ ఆలోచనగా ఉంది. ఆర్ఎస్ఎస్ బీజేపీ రెండూ ప్రమాదకరమని ప్రత్యర్ధులు ఎన్ని విమర్శలు చేసినా ఈ రోజున దేశంలో బలమైన భావజాలాన్ని వ్యాప్తి చేయడమే కాకుండా అందులో విజయం సాధించిన వైనాన్ని అంతా చూస్తున్నారు.

ఇక ఆర్ఎస్ఎస్ లక్ష్యాలు చాలా ఉన్నాయి. బీజేపీ అజెండా కూడా ఉంది. వాటిని సాధించే దిశగా అడుగులు వేగంగా పడుతున్నాయి. మరో వైపు చూస్తే ఆర్ఎస్ఎస్ హిందూత్వ నినాదం కూడా మరింత ప్రభావవంతంగా సాగేందుకు తగిన వేదికను కూడా ఈ దేశంలో ఏర్పాటు చేస్తున్నారు. భారతీయ సంస్కృతి కి ఆర్ఎస్ఎస్ వట వృక్షం అని మోడీ కీర్తించడం కాదు నవ భారతం ఆర్ఎస్ఎస్ తపస్సు అన్న ఆయన వ్యాఖ్యల మీద విపక్షాలు ప్రత్యర్ధులు ఏ విధంగా రిసీవ్ చేసుకుంటారో చూడాల్సి ఉంది.

Tags:    

Similar News