జన్మ, పునర్జన్మ ఆమే ప్రసాదించింది!

Update: 2015-07-28 04:51 GMT

Full View
నిత్యం తన బిడ్డలగురించే ఆలోచించేది తల్లి! ఆ దేవుడి ప్రతీ చోటా ఉండలేక తల్లిని సృష్టించాడంటారు. ఎన్నిసార్లు విన్నా కొత్తగా అనిపిస్తూ కొత్త కొత్త అనుభూతులను పంచుతుంది ఈ వాక్యం! తన బిడ్డలు సంతోషంగా ఉండాలని ఎన్నో త్యాగాలను చేస్తుంది తల్లి! ఆ త్యాగం.. "ప్రాణం" అయినా కూడా క్షణం ఆలోచించదు! అదే మాతృమూర్తి ప్రేమ... మాటలకు అందని ప్రేమ!

విషయానికి వస్తే... చైనాలోని జింగ్ హూ సిటీలో 30ఏళ్ల వయసున్న ఒక మహిళ షాపింగ్ కు వెళ్లింది. ఆ షాపింగ్ మాళ్ లో పై అంతస్తుకు వెల్లేందుకు ఎస్కలేటర్ ఎక్కింది. షాపింగ్ అంతా పూర్తిచేసుకుని మరలా ఎస్కలేటర్ పై దిగుతుండగా... ఉన్నట్లుండి ఒక్కసారిగా ఎస్కలేటర్ చివరి అంచు వెండి ప్లేటు ఎగిరిపోయింది. ఇంకేముంది రెప్పపాటులో ఎస్కలేటర్ రూపంలో వచ్చిన మృత్యువు ఆమెను తీసుకుపోయింది! ఈమెను రక్షించడానికి మాల్ సిబ్బంది అలర్టయ్యి ప్రయత్నించినా ఫలితం లేకపోయింది!

అయితే తాను మృత్యువు ఒడిలోకి జారుకుంటున్న విషయం గ్రహించి కూడా దైర్యంగా క్షణాల్లో అలర్టయ్యింది. తన ప్రాణాలను పణంగా పెట్టి తన కొడుకుని కాపాడుకుంది. ఒకసారి ప్రాణాలకు తెగించి జన్మను ప్రసాదించిన తల్లే... ఈసారి ప్రాణాలను పోగొట్టుకుంటూ కూడా పునర్జన్మను ప్రసాదించింది. అదే కదా తల్లి హృదయం.
Tags:    

Similar News