బరువు తగ్గితే బంపర్ గిఫ్ట్ గా బంగారం!

Update: 2015-07-19 08:32 GMT
వెనుకబడిన.. పేద దేశాలు ఇంకా ఆకలి చావుల దశలోనే ఉన్నాయి. కొన్ని కోట్ల మందికి కనీసం మూడుపూటలా అన్నం దొరకని పరిస్థితి ఉందిక్కడ. ఆకలి చావులకు లోటే లేదు. ఇక అన్నం దొరికినా చాలా మందికి పోషకాహార లోపం ప్రధాన సమస్య. పోషకాహార లోపంతో అనేక మంది జబ్బుల బారిన పడుతున్నారు. చనిపోతున్నారు కూడా. ప్రపంచంలో ఎన్నో దేశాల్లో ఈ సమస్య ఉంది. వెనుకబడ్డ ఆసియా, ఆఫ్రికా దేశాల్లో ఇదొక తీవ్రమైన సమస్య. ఎప్పటికి పరిష్కారం అవుతుందో కూడా అంతుబట్టని సమస్య.

మరి చాలా దేశాల్లో ఇలాంటి పరిస్థితి ఉంటే.. మరికొన్ని దేశాల్లో జనాలకు తిండి ఎక్కువ అయ్యింది. కొవ్వు పదార్థాలతో కూడిన ఆహారం తీసుకోవడం ద్వారా ఇబ్బందులు పడుతున్నారు. ఊబకాయంతో ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఆ దేశాలకు ఇది ఒక జాతీయ సమస్యగా మారింది. ఒకరిద్దరు కాకుండా. దేశ జనుల్లో ఎక్కువశాతం మంది ఊబకాయంతో బాధపడుతున్నారు. తినడానికి సమృద్ధిగా అన్నీ లభిస్తుండే సరికి వారు అలా తయారవుతున్నారు. చివరకు ఊబకాయం అనేది వారి జాతీయ సమస్యగా మారింది.

అలాంటి సమస్యను ఎదుర్కొంటున్న దేశాల్లో ఒకటి దుబాయ్. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజల ఊబకాయాన్ని తగ్గించడానికి అక్కడి ప్రభుత్వం నడుంబిగించింది. ఫిట్ నెస్ తో ఉండాలి... అడ్డదిడ్డంగా పెరిగిపోకూడదు.. అనే హితబోధలు చేసినా ప్రజలు వినడం లేదు. ఈ నేపథ్యంలో.. ప్రభుత్వం ఒక బంపర్ ఆఫర్ ప్రకటించింది. బరువు తగ్గితే బంపర్ ప్రైజ్ లు అనే విషయాన్ని ప్రకటించింది .నిర్ధిష్ట సమయంలో. .వ్యాయామంతోనో.. మరో రకంగా.. బరువు తగ్గి ఫిట్ గా తయారైతే.. బంగారాన్ని ప్రైజ్ గా ఇస్తామని దుబాయ్ ప్రభుత్వం దీర్ఘకాలంగా ఒక ఆఫర్ ను అమల్లో ఉంచింది. అయితే ఈ కాంపిటీషన్ లో ఉత్సాహంగా పాల్గొనడానికి వస్తున్నవారు కూడా తక్కువమందే అనుకోండి!
Tags:    

Similar News