ప్రపంచానికే పెద్ద అయిన అమెరికా అధ్యక్షుడి కుమార్తె అంటే.. ఆ అమ్మాయి రేంజ్ ఎలా ఉంటుంది? అలాంటి అమ్మాయి.. పార్ట్‌టైమ్ జాబ్ చేయటానికి ఉత్సాహం ప్రదర్శిస్తారా? అన్న సందేహం కలగొచ్చు. కానీ.. మిగిలిన వారి సంగతేమో పక్కన పెడితే.. ఒబామా కుమార్తె మాత్రం పార్ట్‌టైం జాబ్‌లో చేరేందుకు ఏ మాత్రం మొహమాట పడటం లేదు.
మామూలుగా అయితే.. అత్యంత పటిష్టమైన భద్రత నీడలో ఉంటే అమెరికా అధ్యక్షుని కుమార్తె..తన వేసవి సెలవుల్ని పురస్కరించుకొని హెచ్‌బీవో టీవీ ఛానల్‌లో ప్రసారమయ్యే గర్ల్స్ సిరీస్‌లో పని చేసేందుకు మక్కువ ప్రదర్శిస్తోంది. ఈ మధ్యనే 17వ పుట్టినరోజు వేడుకల్ని పూర్తి చేసుకున్న ఒబామా పెద్ద కుమార్తె మలియా.. టీవీ ఛానల్‌లో ఉద్యోగంలో చేరటానికి రంగం సిద్ధం చేసుకుందని చెబుతున్నారు.
తన గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకున్న తర్వాత టీవీ.. సినిమాల్లో డైరెక్షన్ కెరీర్‌ను ఎంచుకుంటానని గతంలోనే చెప్పిన మలియా.. అందుకు తగ్గట్లే అడుగులు వేస్తోంది. ప్రపంచ పెద్దన్నకు అధ్యక్షుడి కుమార్తె హోదాలో ఉండి కూడా పార్ట్‌టైం జాబ్ చేసేందుకు ఎలాంటి మొహమాటం పడని మలియా మరెందరికో స్ఫూర్తి అనటంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు.