సెల్ఫీ వ్యామోహం జనాలను పిచ్చోళ్లను చేస్తోంది. జనాలు ఏం చేస్తున్నామన్న విజ్నత మరిచిపోయి పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తున్నారు. ఇప్పటికే బ్రిడ్జీల మీద.. రైలు బండ్ల మీద.. కొండల మీద సెల్ఫీలు దిగబోయి ప్రాణాలు కోల్పోయిన సంఘటనలు చూశాం. ఓ ప్రబుద్ధుడు చనిపోయిన తాత పక్కన నిలబడి సెల్ఫీ దిగితే.. ఇంకో వెధవ శవాన్ని మోస్తూ సెల్ఫీ దిగాడు. వీటన్నింటినీ తలదన్నే దారుణమైన సెల్ఫీ ఘటన వెనిజులాలో చోటు చేసుకుంది. ఓ ప్రెగ్నెంట్ లేడీకి డెలివరీ చేస్తూ ఓ వైద్యుడు సెల్ఫీ దిగాడు. ఓవైపు డెలివరీ కోసం ప్రయత్నాలు జరుగుతుంటే పక్కన నిలబడి సెల్ఫీ దిగాడు.
అవతల ఆ లేడీ ఎంత బాధపడుతోందో.. ఎంతగా ఏడుస్తోందో.. ఇతను సెల్ఫీ దిగుతున్న సంగతైనా ఆమెకు తెలుసో లేదో. సెల్ఫీ దిగడమే కాదు.. ‘‘ఓ మహిళా.. నేను నీ పాపను డెలివరీ చేయిస్తాను. దాని కంటే ముందు నన్ను సెల్ఫీ దిగనివ్వు’’ అంటూ క్యాప్షన్ కూడా పెట్టి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు ఆ మూర్ఖుడైన వైద్యుడు. అతగాడి పేరు సాంచెజ్ అట. బాధ్యతాయుతమైన వైద్యుడై ఉండి.. డెలివరీ సమయంలో ఇంత దారుణంగా వ్యవహరించడంపై ప్రపంచవ్యాప్తంగా తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. జనాలు అతడిపై దుమ్మెత్తి పోశారు. అంతే కాదు.. అతడిపై పోలీసు విచారణ చేపట్టాలంటూ ఆన్ లైన్లో ఐదు వేల మంది సంతకాల సేకరణ కూడా చేపట్టారు. సాంచెజ్ చేసిన పాపానికి కచ్చితంగా శిక్ష పడాల్సిందే అని వారంతా డిమాండ్ చేస్తున్నారు.