రోడ్డు మీదకొచ్చిన అమ్మాయిల్ని పోకిరీ కుర్రాళ్లు మాత్రమే ఏడిపిస్తారని తెలుసు. అప్పుడప్పుడు వయసు మీద పడిన వృద్ధులు కూడా చికాకు పెట్టటం కూడా మామూలే. కానీ.. ఏకంగా ఒక బుజ్జి ఉడత తెగ ఇబ్బంది పెట్టేస్తుందని.. తనను ప్రశాంతంగా ఉండనీయటం లేదంటూ ఒక అమ్మడు వేసిన చిందులతో.. పోలీసులు స్పందించక తప్పింది కాదు.
ఈ చిత్రమైన ఘటన జర్మనీలో చోటు చేసుకుంది. ఆ దేశంలోని నార్త్ రైన్ వెస్ట్ ఫాలియాలోని బోట్రాప్ నగరంలో ఒక అతివ.. చెంగు చెంగున ఎగిరే ఒక బుజ్జి ఉడత మీద పోలీసులకు కంఫ్లైంట్ చేసింది. తాను ఎక్కడికి వెళితే అక్కడకు వస్తుందని.. తనను సదరు ఉడత ఫాలో అవుతుందని పేర్కొంది.
ఆమె మాటల్ని విన్న జర్మనీ పోలీసులు కాసింత చిత్రంగా చూసి.. నవ్వి చర్యలు తీసుకుంటామని పంపించేశారు. అయితే.. ఆమె మరోసారి పోలీసులకు ఫోన్ చేసి తనను ఉడత ఫాలో అవుతుందని చెప్పి.. దాని సంగతి చూడాలని ప్రాధేయపడంతో.. రంగంలోకి దిగిన పోలీసులు సదరు బుజ్జి ఉడతను పట్టేశారు.
వీధుల్లో స్వేచ్ఛగా సంచరించే ఉడతను తీసుకొచ్చి బంధించటంతో అన్నం తినటం మానేసిందట. దీంతో పోలీసులు ప్రత్యేక శ్రద్ధతో ఆహారాన్ని అందిస్తున్నారు. ఈ స్టోరీ మొత్తం చదువుతున్నప్పుడు లీలగా మనకు రాజమౌళి ఈగ గుర్తుకు రావటం లేదు. సినిమాలోఈగ ప్లేస్ లో ఉడతను ఊహించుకుంటే.. కాస్తంత కనెక్ట్ కాదు?
లేనిపోయింది. .సదరు అమ్మడుకి.. ఉడతకు ఏదైనా గత జన్మ బంధం ఉందా? మన తెలుగు సినిమా అక్కడెక్కడో జర్మనీలో ఉన్న వాళ్లు చూసే ఛాన్స్ లేదు కాబట్టి.. ఆ దిశగా ఆలోచించే అవకాశమే లేదు. ఏది ఏమైనా ఒక అమ్మాయిని వేధిస్తోందన్న కారణంగా ఉడతను బంధించటం.. జైల్లో పెట్టటం మాత్రం విచిత్రమే కదూ..?