పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ రంగంలో ఉబెర్ క్యాబ్స్ ఓ సెన్సేషన్. మన దేశంలో మాత్రమే కాదు.. ప్రపంచ వ్యాప్తంగా చాలా దేశాల్లో ఉబెర్ క్యాబ్స్ కు అద్భుతమైన ఆదరణ ఉంది. ఆ మధ్య ఉబెర్ క్యాబ్స్ డ్రైవర్ చేసిన అఘాయిత్యానికి ఆ సంస్థ బాగా ఇబ్బంది పడ్డా.. దాని బ్రాండ్ వాల్యూ ఏమీ పెద్దగా తగ్గలేదు. కొన్నాళ్ల పాటు నిషేధం ఎదుర్కొని మళ్లీ సిటీ రోడ్లపై ఉబెర్ క్యాబ్ దూసుకెళ్తోంది. ఐతే ఈ ఉబెర్ క్యాబ్ వాళ్లు జనాల్ని దగా చేస్తున్నారంటూ న్యూయార్క్ థింక్ ట్యాంక్ డేలా అండ్ సొసైటీ పెద్ద బాంబు లాంటి న్యూస్ ఒకటి బయటపెట్టింది.
ఉబెర్ క్యాబ్ బుక్ చేయడానికి యాప్ ఓపెన్ చేస్తే మనకు సమీపంలో ఏయే ప్రాంతాల్లో క్యాబ్ అందుబాటులో సూచిస్తూ మ్యాప్ ప్రత్యక్షమవుతుందన్న సంగతి తెలిసిందే. మనకు దగ్గర్లో హైలైట్ అవుతున్న క్యాబ్ మీద క్లిక్ చేస్తే అది మనమున్న చోటికి వచ్చేస్తుంది. ఐతే ఈ మ్యాప్ వెనుక మోసం ఉందంటోంది న్యూయార్క్ థింక్ ట్యాంక్ సంస్థ. నిజానికి మ్యాప్ లో చూపించే ప్రాంతంలో క్యాబ్ ఉంటుంది కానీ.. నిజానికి డ్రైవర్ అందుబాటులో ఉండడని.. ఐతే నిజంగానే క్యాబ్ మనకు అందుబాటులో ఉన్నట్లు భ్రమ కల్పించేలా డీఫాల్ట్ సెట్టింగ్స్ చేశారని.. ఆ మ్యాప్ లో కనిపించేదంతా వాస్తవం కాదని అంటోంది ఈ సంస్థ. ఈ విషయంలో తాము పరిశోధన జరిపి వాస్తవాలు తెలుసుకున్నామని.. కొన్నిసార్లు క్యాబ్ అందుబాటులో ఉన్నా ఈ మ్యాప్ మాత్రం లేదన్నట్లు చూపిస్తున్నట్లు కూడా తేలిందని అంటోందా సంస్థ. మరి ఈ ఆరోపణలపై ఉబెర్ క్యాబ్స్ సంస్థ ఏమంటుందో చూడాలి.