ఆకాశంలో వింత ఆకారాలు కనిపించటం ఈ మధ్య ఎక్కువ అవుతోంది. ఆకాశంలో కనిపిస్తున్న ఆకారాలకు సంబంధించిన పక్కా సమాచారం తెలీనప్పటికీ.. వీటిపై పలు ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి.
ఆ మధ్య ఏపీలోని నెల్లూరులో.. ఆ తర్వాత తెలంగాణలోని మహబూబ్‌నగర్ జిల్లాలోని అచ్చంపేటలో ఆకాశంలో వింత ఆకారాలు ఎగురుతూ కనిపించాయి. అవేమిటన్న విషయం ఎవరూ ఏమీ చెప్పలేకపోతున్నారు.దీనికి సంబంధించి విస్మయానికి గురి అవుతున్నాయి. ఇదిలా ఉంటే.. తాజాగా జపాన్‌లోనూ ఇలాంటి ఆకారాలు కనిపించి కొత్త చర్చకు తావిచ్చాయి.
తెలుగు రాష్ట్రాల్లో కనిపించిన వింత ఆకారాలకు సంబంధించిన వీడియో లేనప్పటికీ.. జపాన్ లోని ఒసాకాలో ఆకాశంలో కనిపించిన ఆకారాలకు సంబంధించిన నిమిషం నిడివి ఉన్న వీడియో ఒకటి బయటకు వచ్చింది.
ఆకాశంలో తెల్లటి ఆకారాల్లో ఉన్న ఈ వింత వస్తువులు ఏమిటన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇవి ఎగిరే పళ్లాలా..లేక మరొకటా అన్నది తేలటం లేదు. అయితే.. ఈ వీడియోను జాగ్రత్తగా గమనిస్తే.. ఆకాశంలో గుంపుగా ఎగురుతూ కనిపించిన తెల్లటి వస్తువుల్లో ఒకటి.. మరోదాన్ని చాలా దగ్గరగా వెళ్లాయి. అయినప్పటికీ రెండింటికి ఏమీ కాకుండా.. వేటికవి విడిపో్యాయి. మరి.. ఈ వీడియోలో కనిపించిన వింత ఆధారాలపై ఎవరూ ఏమీ చెప్పటం లేదు. ఆకాశంలో కనిపించిన ఈ వింత ఆకారాలు తాజాగా మరోసారి ఆసక్తికర చర్చకు తెర తీశాయి.