ఆమె కారులో ప్రసవించింది..అతడు కెమెరాకు పనిచెప్పాడు

Update: 2015-07-26 12:53 GMT

Full View



నిండు గర్భిణి, ప్రసవ సమయం ఆసన్నమైంది. అప్పుడు ఎవరైనా ఏమి చేస్తారు, చేయగలరు? ముందుగానే గ్రహించి ఆస్పత్రిలో చేరిపిస్తారు లేదా వైద్యులనే ఇంటికి రప్పింఛడం వంటివి చేస్తారు! అలా కాకుండా హాస్పటల్ కు వెళ్తున్న దారిలోనే ప్రసవం అయిపోయే పరిస్థితి వస్తే... అదే జరిగింది టెక్సాస్ లో!

విషయానికి వస్తే... లెజియా అనే నిండు గర్భిణికి ప్రసవ సమయం దగ్గరకు రావడంతో తన భర్తతో కలిసి హాస్టన్ లోని తమ ఇంటినుండి బర్తింగ్ సెంటర్ కు సొంత కారులో బయలుదేరారు! అలా సుమారు 45 నిమిషాలు ప్రయాణింఛిన తర్వాత ఆమెకు నెప్పులు తీవ్రమవడం జరిగింది. పరిస్థితిని అర్థం చేసుకున్న ఆమె... హాస్పటల్ కి వెళ్లేవరకూ ఆగే అవకాశం లేదని గ్రహించింది. ఈలోపే శిశువు తల బయటకు రావడం మొదలైంది! దీంతో పరిస్థితిని గమనించిన భర్త ఆమె ధరించిన దుస్తులు కాస్త తొలగించడంతో సుమారు 10 పౌడ్ల బరువుతో పడంటి బిడ్డ ఈ భూమిమీదకి వచ్చేశాడు!

ఈ పరిస్థితి అంటటినీ ఆమె భర్త కెమెరాలో బందించాడు! ఆ వీడియో ఇప్పుడు యూట్యూబ్ లో హల్ చల్ చేస్తోంది. సుమారు 1.8 కోట్ల మంది ఇప్పటివరకూ ఆ వీడియోని వీక్షించారు! లెజియా మాతృ హృదయాన్ని, పిల్లలకు జన్మనిచ్చే విషయంలో తల్లి తీసుకున్న రిస్క్ ని, చేసిన సాహసాన్ని, ఆమెకున్న మనోదైర్యాన్ని పలువురు కొనియాడుతున్నారు!

"ఇది మాకు అద్భుతంగా అనిపించింది! ఆమె వీడియో తీయమంటే నాకు చాలా భయమేసింది! ఒకపక్క ఆమె ప్రసవ వేదనలో ఉండగా... భర్తగా నేను వీడియో తీయాలంటే అది పెద్ద సాహసమే! అయినా కూడా నేణు తీయగలిగా, అది నాకు ఇప్పుడు అద్భుతంగా అనిపిస్తుంది" అని ఆమె భర్త మీడియాకు తెలిపాడు!
Tags:    

Similar News