బాత్‌ రూంలో అమ్మాయి వీడియో తీసిన అమ్మాయిలు!

స్త్రీకి స్త్రీయే శత్రువు అనే విషయం ఎంతవరకూ కరెక్ట్

Update: 2023-07-24 05:25 GMT

స్త్రీకి స్త్రీయే శత్రువు అనే విషయం ఎంతవరకూ కరెక్ట్ అనే సంగతి కాసేపు పక్కనపెడితే... తాజాగా జరిగిన ఒక విషయంలో మాత్రం ఒక కాలేజీ అమ్మాయికి.. తోటి విద్యార్థినులే శత్రువులయ్యారు. ఆమె బాత్ రూం లో ఉన్న సమయంలో రహస్యంగా వీడియోలు తీశారు. తాజాగా ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది.

అవును... కర్ణాటక రాష్ట్రం ఉడుపిలోని ఓ కళాశాలలో ఆప్టోమెట్రీ కోర్సు అభ్యసిస్తున్న ముగ్గురు అమ్మాయిలు.. బాత్‌ రూంలో ఉన్న తోటి విద్యార్థినిని రహస్యంగా వీడియో తీశారు. ఈ విషయం యాజమాన్యానికి తెలియడంతో వారిని కళాశాల నుంచి సస్పెండ్ చేశారు. ఈ విషయంపై స్పందించిన నేత్ర జ్యోతి కళాశాల డైరెక్టర్‌ రష్మీ కృష్ణప్రసాద్‌... బుధవారం ఈ ఘటన చోటు చేసుకుందని తెలిపారు.

ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన పూర్తి వివరాళ్లోకి వెళ్తే... తమ తోటి విద్యార్థిని బాత్ రూం లో ఉన్న సమయంలో మరో ముగ్గురు అమ్మాయిలు రహస్యంగా వీడియోలు తీయడం మొదలుపెట్టారంట. అయితే వారు ఇలాంటి పనులు చేయడం ఇదే తొలిసారి కాదని తెలుస్తుంది!

అయితే ఈ ఘటనలో ముగ్గురు అమ్మాయిల టార్గెట్ ఇతర అమ్మాయిలని, పొరపాటున వీడియో తీసినట్లు వారే బాధితురాలికి చెప్పడం గమనార్హం. ఆ వీడియోను బాధితురాలి ముందే వారు డిలీట్‌ చేశారు. అనంతరం ఈ విషయాన్ని బాధితురాలు తన స్నేహితులకు చెప్పడంతో.. వారు జరిగిన విషయాన్ని కలాశాల యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లారు.

దీంతో విషయాన్ని సీరియస్ గా తీసుకున్న యాజమాన్యం... ఆ ముగ్గురు అమ్మాయిలను సస్పెండ్ చేసింది. కొన్ని అనివార్య కారణాల వల్ల బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు ఇష్టపడలేదని తెలుస్తుంది. అయితే ఈ ఘటనలోని సీరియస్ నెస్ ని అర్ధం చేసుకున్న కలాశాల యాజమాన్యం స్వయంగా పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తుంది.

దీంతో... ఫోర్సెనిక్‌ పరీక్ష కోసం వీడియోగ్రఫీకి వినియోగించిన ఫోన్‌ ను సైతం అందజేశామని ఆ కళాశాల డైరెక్టర్‌ రష్మీ చెబుతున్నారు. ఈ ఘటనపై విచారణ ప్రారంభించామని మాల్పే స్టేషన్‌ హౌస్‌ ఆఫీసర్‌ తెలిపారు.

Tags:    

Similar News