ఆమెకు మరణం ఒక వరం

కారుణ్య మరణాన్ని ప్రసాదించాలని అడిగేవారూ ఉన్నారు. కానీ కర్ణాటక ప్రభుత్వం దానిని తొలిసారిగా అమలు చేస్తోంది.

Update: 2025-02-13 03:15 GMT

మరణం గౌరవంగా ఉండాలని ఈ దేశంలో కోరుతూ ఉన్నారు. కారుణ్య మరణాన్ని ప్రసాదించాలని అడిగేవారూ ఉన్నారు. కానీ కర్ణాటక ప్రభుత్వం దానిని తొలిసారిగా అమలు చేస్తోంది. దేశంలో ఇది ఒక విప్లవాత్మకమైన నిర్ణయం. నిజంగా చెప్పాలీ అంటే చారిత్రాత్మకమైన నిర్ణయం.

ఇతర దేశాలలో కారుణ్య మరణాలకు అనుమతి ఉంది. దేశంలో దానిని తొలిసారి అమలు చేస్తున్న ఘనత కర్ణాట్క ప్రభుత్వానిదే. ఇక ఆ కారుణ్య మరణాన్ని వరంగా పొందబోతున్నది ఒక మహిళ. ఆమె కూడా ఈ దేశంలో ఒక రికార్డుగా మిగలబోతున్నారు. ఎవరినీ ఎప్పటికీ నయం కానీ వ్యాధులతో సుదీర్ఘకాలం అవస్థలు పడుతూ జీవశ్చవం గా ఉన్న వారికి ఈ కారుణ్య మరణాన్ని అనుమతిస్తారు.

అలా చూస్తే కనుక కర్ణాటకలోని 85 ఏళ్ళ రిటైర్డ్ టీచర్ కరిబసమ్మది ఈ తరహా తొలి మరణం కానుంది. ఆమె ఏకంగా మూడు దశాబ్దాలకు పైగా స్లీప్డ్ డిస్క్ కారణంగా దీర్ఘకాలిక వెన్నునొప్పితో బాధపడుతున్నారు. దానితో పాటుగా కాన్సర్ బారిన పడి నరకం అనుభవిస్తున్నారు.

ఆమె ఇపుడు సుప్రీం కోర్టు ఆదేశాలతో కర్ణాటక ప్రభుత్వం అమలు చేస్తున్న కారుణ్య మరణాన్ని పొందే వరాన్ని అందుకున్నారు. ఆమె జీవితంలో విలువైన కాలం అలా జీవితం లేని మరణంగానే గడచిపోయింది. దాంతో ఆమె అలుపెరగని పోరాటం బతుకు కోసం చేశారు. కానీ కుదరని పరిస్థితుల్లో శాశ్వతమైన విశ్రాంతిని కోరుకుంటున్నారు.

ఒక విధంగా ఆమె చరిత్రను ఈ దేశంలో సృష్టించబోతున్నారు. మరణం ఒక వరమని ఆమె చెప్పబోతున్నారు. జీవితం ఒక శాపమని కూడా ఆమె తన అనుభవాన్ని చరిత్రలో చేర్చబోతున్నారు. ఎవరికైనా జీవితం తీపిగా మరణం చేదుగా ఉంటుంది. కానీ కొందరు దురదృష్టవంతులకు జీవితమే భయంకరంగా ఉంటుంది. చేదుగా మారుతుంది. అటువంటి వారి విషయంలో మరణమే మేలు అన్నట్లుగా ఉంటుంది. అందుకే ఆమె మరణాన్ని ఆశ్రయిస్తున్నారు. మృత్యు కౌగిలిఒని చేరే తొలి మహిళగా మారబోతున్నారు.

ఇది ఆరభంగా ఉంటే ఈ కారుణ్య మరణాల జాబితాలో ఇంకెందరు చేరుతారో చూడాలి అంతే కాదు కర్ణాటక శ్రీకారం చుట్టిన ఈ విధానం రేపటి రోజున దేశంలో మిగిలిన రాష్ట్రాలు కూడా అనుసరిస్తే కనుక జీవితంతో పాటు మరణంలోనూ రేపటి తరం పోటీ పడుతుందేమో చూడాల్సి ఉంది.

Tags:    

Similar News