'గ్యాబ్లింగ్ ఫీల్డ్ లో మాస్టర్ ని'.. బెట్టింగ్ యాప్స్ పై చికోటి సంచలన వ్యాఖ్యలు!
అవును... చికోటి ప్రవీణ్ అనే పేరు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఒకప్పుడు తీవ్ర సంచలనం అనే సంగతి తెలిసిందే.;
ప్రస్తుతం ఎటువైపు చూసినా, ఏ మూల చూసినా బెట్టింగ్ యాప్స్ కి సంబంధించిన చర్చ జరుగుతోందన్నా అతిశయోక్తి కాదేమో. ప్రధానంగా మరో రెండు రోజుల్లో ఐపీఎల్-2025 సీజన్ స్టార్ట్ కానుండటంతో.. వీటికి సంబంధించిన ప్రచారం ఊపందుకుందని అంటున్నారు. ఈ సమయంలో చికోటి ప్రవీణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
అవును... చికోటి ప్రవీణ్ అనే పేరు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఒకప్పుడు తీవ్ర సంచలనం అనే సంగతి తెలిసిందే. ప్రధానంగా 2022 ప్రాంతంలో క్యాసినో, సినీ రాజకీయ ప్రముఖులతో పరిచయాలు మొదలైన వ్యవహారాలతో ఈ పేరు నెట్టింట తీర సంచలనంగా మారింది. ఈ సమయంలో బెట్టింగ్ యాప్స్ పై ప్రవీణ్ తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు.
తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన... బెట్టింగ్ యాప్స్ లో డబ్బులు ఎవరికీ రావని, గ్యాంబ్లింగ్ లో ఎప్పుడూ హౌసే గెలుస్తోందని, అదంతా అలా సెటప్ చేయబడి ఉంటుందని.. ఇక బెట్టింగ్ యాప్స్ సంగతి చెప్పే పనే లేదని.. ఏఐ టెక్నాలజీ వచ్చిన తర్వాత అది పూర్తిగా యూజర్స్ ని మోసం చేసే విధంగానే డిజైన్ చేయబడి ఉంటుందని తెలిపారు!
ఈ నేపథ్యంలో.. తాను గ్యాంబ్లింగ్ ఫీల్డ్ లో మాస్టర్ ని అని చెప్పుకున్న చికోటి ప్రవీణ్... గ్యాంబ్లింగ్ ఆడిన వ్యక్తి బాగుపడినట్లు చరిత్రలో లేదని.. ఇదే విషయాన్ని తాను వందల ఇంటర్వ్యూల్లో చెప్పానని.. బెట్టింగ్ లో ఒకేసారి పెద్ద మొత్తంలో డబ్బులు సంపాదించొచ్చనేది పూర్తిగా అపోహ అని స్పష్టం చేశారు.
అలా కాదని ఎవరైనా భావించి తన వద్దకు వస్తే.. వారికి తాను లక్ష రూపాయలు ఇస్తానని.. రెండు నెలలు దానితో గ్యాంబ్లింగ్ ఆడి.. తర్వాత తనకు లక్షపై ఒక వెయ్యి రూపాయలు వేసి ఇవ్వండి చాలు అని సవాల్ విసిరారు! ప్రపంచంలో గ్యాంబ్లింగ్ లో ఎవరూ గెలవలేదని, గెలవరని ప్రవీణ్ పునరుద్ఘాటించారు.
ఈ బెట్టింగ్ లో జనం పోగొటుకున్న సొమ్మంతా దేశం దాటి ఇతర దేశాల్లోని ఉగ్రవాదుల చేతికి చేరితే... తిరిగి మన దేశంపైకి బాంబుల రూపంలోనో, ఉగ్రవాదుల రూపంలోనో, లవ్ జీహాదీలకు ఫండింగ్ రూపంలోనో తిరిగి వస్తోందని హెచ్చరించారు. దీంతో... ఈ వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. ఈ గ్యాంబ్లింగ్ లపై ప్రభుత్వాలు మరింత ఉక్కుపాదం మోపాల్సిన అవసరం ఉందని కోరుతున్నారు!