ఈ శునకం ధర రూ.50 కోట్లు... మమ్మీ, డాడీ షాకింగ్ కాంబినేషన్!

అవును... తాజాగా నెట్టింట వైరల్ గా మారిన ఒకామీ అనే శునకం ధర రూ.50 కోట్లు. అయితే... ఆ శునకం అంత రేటు పలకడానికి కారణం.. దాని అరుదైన బ్రీడ్ అని చెబుతున్నారు.;

Update: 2025-03-19 17:03 GMT

సాధారణంగా పెంపుడు శునకం ధర ఎంతుంటుందంటే... వేలల్లో అని కొంతమంది, లక్షల్లో అని ఇంకొంతమంది చెబుతారు. అంతంత రేటు పెట్టి కొన్న వాటిని చాలా మంది వాళ్ల వాళ్ల ఇంటిలో ఎంతో ప్రేమగా పెంచుకుంటారు. ఇంకొంతమంది అయితే.. ఇంట్లో మరో మనిషి లేకుండా ఒంటరిగా కుక్కలతోనే జీవితం సాగిస్తుంటారు. మనిషికి శునకానికీ ఆ బంధం ఉంది!

ఈ క్రమంలో తాజాగా ఓ శునకం నెట్టింట వైరల్ గా మారింది. అందుకు కారణం దాని ధరే. దాని పేరు ‘ఒకామీ’ కాగా... దీని జన్మస్థలం అమెరికా. ప్రస్తుతం దీని వయసు 8 నెలలు కాగా.. బరువు మాత్రం ప్రస్తుతం 75 కిలోలు. ఏది ఏమైనా... ఇప్పుడు ఇది ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన శునకంగా రికార్డ్ సృష్టించింది. దీని ధర రూ.50 కోట్లు!

అవును... తాజాగా నెట్టింట వైరల్ గా మారిన ఒకామీ అనే శునకం ధర రూ.50 కోట్లు. అయితే... ఆ శునకం అంత రేటు పలకడానికి కారణం.. దాని అరుదైన బ్రీడ్ అని చెబుతున్నారు. ఇందులో భాగంగా... ఇది తోడేలు, కాకేషన్ షెపర్డ్ జాతి కుక్క యొక్క క్రాస్ బ్రీడ్ అంట. అందుకే దీని ధర రికార్డ్ స్థాయిలో ఉందని చెబుతున్నారు.

ఈ క్రమంలో ఈ శునకాన్ని రూ.50 కోట్లు చెల్లించి కొన్నారు ప్రముఖ డాగ్స్ బ్రీడర్ సతీష్. దీంతో.. మరోసారి ఆయన పేరు నెట్టింట హల్ చల్ చేస్తోంది. వాస్తవానికి 1990 నుంచి ఈ డాగ్స్ బ్రీడింగ్ బిజినెస్ లో ఉన్నారు సతీష్. ఈ క్రమంలో ఇప్పటికే ఆయన దగ్గర సుమారు 150 రకాల జాతుల శునకాలు ఉన్నాయని చెబుతారు.

వాటితో నేషనల్, ఇంటర్నేషనల్ స్థాయిలో చాలా పోటీల్లో పాల్గొని, ప్రైజులు గెలుచుకున్నారు. ఇక 30 నిమిషాల ప్రదర్శనకు ఆయన రెండున్నర లక్షల రూపాయల వరకూ ఛార్జ్ చేస్తారు. అయితే.. గత పదేళ్ల నుంచి సతీస్.. బ్రీడింగ్ ఆపేసి, అరుదైన కుక్కలను కొని ప్రదర్శనల ద్వారా సంపాదిస్తున్నారు. ఇటీవలే రూ.29 కోట్లతో చౌచౌ జాతి కుక్కను కొన్నారు.

ఇక.. 7 ఎకరాల ఫాం హౌస్ లో ఈ శునకాలను సంరక్షిస్తున్న సతీష్... వాటిని చూసుకోవడానికి ఆరుగురు సిబ్బందిని నియమించారు. వాటిని చూడటానికి, సెల్ఫీలు తీసుకోవడానికి చాలా మంది ఆ ఫామ్ కు వస్తుంటారంట. ఈ ఫామ్ చుటూ సీసీటీవీ పహారా ఉంటుందని చెబుతున్నారు.

ఏది ఏమైనా... తాజాగా తోడేలు, కాకేషన్ షెపర్డ్ జాతి కుక్కలు మమ్మీ డాడీలుగా కలిగిన సరికొత్త బ్రీడ్ శునకాన్ని రూ.50 కోట్లు పెట్టి కొనడంతో ఈ విషయం వైరల్ గా మారింది. మరో ఆసక్తికర విషయం ఏమిటంటే... ఈ ఒకామి.. రోజూ కనీసం 3 కిలోల చికెన్ తిననిదే నిద్రపోదంట! అంటే... ధరే కాదు మెయింటినెన్స్ కూడా గట్టిగానే అన్నమాట!

Tags:    

Similar News