నటీనటులు : మధుర్ మిట్టల్, నాజర్, మహిమా నంబియార్, నరేన్, వేల తదితరులు
సినిమాటోగ్రఫీ: ఆర్డీ రాజశేఖర్
సంగీతం: జిబ్రాన్
నిర్మాత: వివేక్ రంగాచారి
రచన, దర్శకత్వం: ఎం ఎస్ శ్రీపతి
సమర్పణ: శివలెంక కృష్ణ ప్రసాద్
కథ :
తమిళ కుటుంబంలో పుట్టిన ముత్తయ్య మురళీధరన్ ఫ్యామిలీ శ్రీలంక లోని క్యాండీ లో బిస్కెట్ ఫ్యాక్టరీ నడిపిస్తుంటారు. 1970 దశకంలో సింహళీలు, తమిళుల మధ్య ఘర్షణ జరుగుతుంది. ఆ టైంలో మురళీధరన్ తల్లిదండ్రులు అతన్ని ఈ గొడవలకు దూరంగా ఉంచాలని నిర్ణయించుకుని ఒక మిషనరీ స్కూల్ లో వేస్తారు. అక్కడ చదువు కన్నా క్రికెట్ మీద ముత్తయ్య మురళీధరన్ ఆసక్తి చూపిస్తాడు. అసలు ముత్తయ్యకు క్రికెటర్ మీద ఎలా ఆసక్తి మొదలైంది..? అతను శ్రీలంక జట్టులో ఎలా స్థానం సంపాదించాడు..? అందుకు అతను ఎంత కష్టపడ్డాడు..? తన బౌలింగ్ యాక్షన్ మీద వచ్చిన అభియోగాలు ముత్తయ్య ఎలా సమాధానం చెప్పాడు..? వాటిని దాటుకునేందుకు ఎన్ని అవమానాలు ఎదుర్కొన్నాడు..? 800 వికెట్లు ఎలా తీశాడు అన్నది ఈ సినిమా కథ.
కథనం-విశ్లేషణ :
జీవిత కథలను సినిమాగా చెప్పే ప్రయత్నంలో కొన్ని సార్లు మీటర్ దాటి వెళ్తుంటారు కొన్నిసార్లు చెప్పాల్సిన విషయాన్ని సరిగా చెప్పలేరు. ఇండియన్ స్క్రీన్ మీద ఇప్పటికే చాలా బయోపిక్ సినిమాలు వచ్చాయి. ముఖ్యంగా క్రికెటర్స్ జీవిత కథలకు ప్రేక్షకుల్లో ఎక్కువ ఆసక్తి ఉంటుంది. ఎమ్మెస్ ధోని, సచిన్ బయోపిక్ సినిమాల తర్వాత శ్రీలంక స్పిన్నర్ ముత్తయ్య మురళీధరన్ జీవిత కథతో ఈ 800 మూవీ వచ్చింది.
తాత ముత్తయ్య క్రికెట్ మీద ఆసక్తి చూపించగా ఆ సందర్భంలో అది కుదరక ఆ తర్వాత అదే ఆసక్తి మురళికి అదే ముత్తయ్య మురళీధరన్ కి వచ్చేలా చూపిస్తారు. స్కూల్ బోర్డ్ టీం నుంచి ఒక్కో మెట్టు ఎక్కుతూ శ్రీలంక జట్టుకి ఎంపిక అయ్యే వరకు మురళీధరన్ ఎలా కష్టపడ్డాడు అన్నది చూపించారు. ఆ పాత్రలో మధుర్ మిట్టల్ జీవం పోశాడు. ముత్తయ్య బౌలింగ్ యాక్షన్, లుక్స్ యాజిటీజ్ మ్యాచ్ చేశాడు. అయితే పాత్రలో స్ట్రగుల్ ఉన్నా సరే అది ఆడియన్స్ ని ఎంగేజ్ చేయడంలో కొంత విఫలమైంది. 800 మూవీ లో కేవలం అతని క్రీడా నేపథ్యం మాత్రమే కాకుండా ఫ్లాష్ బ్యాక్ లో శ్రీలంకలో జరిగిన సింహళీ
ఫస్ట్ హాఫ్ శ్రీలంక జట్టులో స్థానం సంపాదించడం కోసం మురళీధరన్ ప్రయత్నాలు కొంత మేరకు మెప్పిస్తాయి. ఫస్ట్ హాఫ్ లో అక్కడక్కడ సినిమా సాగదీస్తున్నారన్న భావన కలుగుతుంది. సెకండ్ హాఫ్ లో అతను జీరో నుంచి 800 వికెట్లు ఎలా తీశాడు అన్నది చూపిస్తారు. ఫస్ట్ హాఫ్ కన్నా సెకండ్ హాఫ్ డెప్త్ ఉంటుంది. ముఖ్యంగా తన బౌలింగ్ మీద అబ్జెక్షన్ చేస్తూ ఆస్ట్రేలియన్ అంపైర్ చేసిన అభియోగాలకు అతను టెస్ట్ కు రెడీ అవడం లాంటి సీన్స్ ఉంటాయి.. ఈ సన్నివేశాలు బోరింగ్ అనిపిస్తాయి. ఐసీసీ ఆర్మ్ బేస్ట్ టెస్ట్ తర్వాత మళ్లీ 800 వికెట్లు తీసి వరల్డ్ రికార్డ్ సృష్టించడంతో సినిమా ముగుస్తుంది.
ముత్తయ్య మురళీధరణ్ బయోపిక్ గా కేవలం క్రికెట్ మాత్రమే కాకుండా అతని జీవితంలో జరిగిన అన్ని విషయాల గురించి చాలా ఎమోషనల్ గా చూపించే ప్రయత్నం చేశారు డైరెక్టర్ ఎం.ఎస్ శ్రీపతి. సినిమా తో ఎంటర్టైన్ చేస్తూ గొప్ప బౌలర్ గా మారేందుకు ముత్తయ్య మురళీధరన్ పడిన కష్టాన్ని తెర మీద చూపించారు అయితే వీటిలో ఎమోషనల్ కనెక్షన్ అంతగా ఆడియన్ ని ఎంగేజ్ చేయలేదు.
ఎలాంటి కథ అయినా సరే పాత్రలు వాటి స్వభావాలు ప్రేక్షకులను రీచ్ అయితే దర్శకుడు సక్సెస్ అయినట్టే. ముత్తయ్య మురళీధరన్ జీవిత కథతో 800 మూవీ తీశాడు డైరెక్టర్ శ్రీపతి. అయితే ఇది జరిగిన కథ కాబట్టి కొత్తగా రాయడానికి కుదరదు. మురళీధరన్ జీవితంలో జరిగిన సంఘటనల ఆధారంగానే కథ రాసుకుని దానికి స్క్రీన్ ప్లే రాసుకోవాల్సి ఉంటుంది. సో ఇందులో ఫిక్షనల్ అనే దానికి ఛాన్స్ లేదు. అందుకే సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మంచి టెంపో మెయింటైన్ చేశాడు. అయితే వాటికి కనెక్ట్ అయి ట్రావెల్ అయిన వారికి సినిమా మంచి ఫీల్ అందిస్తుంది. అలా కనెక్ట్ కాలేకపోతే మాత్రం బోర్ కొట్టేస్తుంది. క్రికెటర్ లవర్స్ కి 800 మూవీ నచ్చేస్తుంది. తెర మీద లీడ్ పాత్రకు ఆడియన్ కనెక్ట్ అయితే అతను అక్కడ సక్సెస్ అందుకుంటే ఇక్కడ మనం అందుకున్న ఫీల్ వస్తుంది. 800 మూవీలో కొన్ని సీన్స్ అలా దర్శకుడి తన ప్రతిభ చాటాడు.
నటీనటులు :
ముత్తయ్య పాత్రకు మధుర్ మిట్టల్ న్యాయం చేశాడు. ముత్తయ్య మార్క్ చూపించడం లో అతను సక్సెస్ అయ్యాడు. ముందు దర్శకుడు శ్రీపతి ఈ పాత్రకు విజయ్ సేతుపతిని అనుకున్నాడు కానీ మధుర్ మిట్టల్ ని చూశాక శ్రీపతి నిర్ణయం పర్ఫెక్ట్ అనిపిస్తుంది. శ్రీలంక కెప్టెన్ అర్జున్ రణతుంగ పాత్రలో నటించిన కింగ్ రత్నం ఇంప్రెస్ చేశారు. ముత్తయ్య మురళీధరన్ తల్లిదండ్రులు, బామ్మ, భార్యగా చేసిన మహిమా నంబియార్, నరేన్ అంతా కూడా ఇచ్చిన పాత్రలకు న్యాయం చేశారు. బయోపిక్ కాబట్టి పూర్తి కథ వాటిలో బలమైన సన్నివేశాలు అన్నీ లీడ్ రోల్ మీదే ఉన్నాయి కాబట్టి ప్రతి సీన్ లో మధు మిట్టల్ తన మార్క్ చూపించాడు. మిగతా వారంతా తమ పరిధి మేరకు నటించి మెప్పించారు.
సాంకేతిక వర్గం :
బయోపిక్ కథలకు ప్రత్యేకంగా క్రికెటర్ జీవిత కథలను తెర మీద తెచ్చే ప్రయత్నంలో టెక్నికల్ టీం సపోర్ట్ చాలా అవసరం. 800 మూవీకి సాంకేతిక వర్గం పనితీరు సినిమాకు కొంతమేరకు సపోర్ట్ చేసింది. సినిమాటోగ్రఫీ ఆర్డీ రాజశేఖర్ మంచి విజువల్స్ ఇచ్చారు. వి.ఎఫ్.ఎక్స్ వర్క్ ఇంకాస్త బెటర్ గా ఉంటే బాగుండేది. ఇమ్రాన్ మ్యూజిక్ సినిమాకు హెల్ప్ అయ్యింది. కానీ సినిమాలో ఒక్క పాట లేకపోవడం మైనస్సే. దర్శకుడు ఎం.ఎస్ శ్రీపతి తను చెప్పాలనుకున్న కథను చెప్పడంలో కొంతమేరకు సక్సెస్ అయినా ఇంకాస్త కథనం బాగా రాసుకుని ఉంటే బాగుండేదని అనిపిస్తుంది. సినిమాకు పెట్టిన బడ్జెట్ అందుకు తగిన అవుట్ పుట్ తెర మీద కనిపిస్తుంది.
చివరగా : 800.. ప్రయత్నం మంచిదే కానీ..!
రేటింగ్ : 2.25 /5
Disclaimer : This Review is Just An Opinion of One Person. Please Do Not Judge The Movie Based On This Review And Watch Movie in Theater