షణ్ముఖ పోస్టర్.. ఇదేదో వర్క్ అవుట్ అయ్యేలా ఉందే..?

కంటెంట్ ఉన్న సినిమాలకు తెలుగులో ఎప్పుడు డిమాండ్ ఉంటుంది. కంటెంట్ తో వస్తే అది తెలియని వాళ్ల సినిమా అయినా సరే సూపర్ హిట్ చేస్తారు

Update: 2024-09-20 14:28 GMT

కంటెంట్ ఉన్న సినిమాలకు తెలుగులో ఎప్పుడు డిమాండ్ ఉంటుంది. కంటెంట్ తో వస్తే అది తెలియని వాళ్ల సినిమా అయినా సరే సూపర్ హిట్ చేస్తారు. ఐతే కాస్త పరిచయం ఉండి మంచి కథ కథనాలతో వస్తే ఆ సినిమాను తప్పకుండా తెలుగు ఆడియన్స్ ఆదరిస్తారు. అలాంటి ఒక క్రేజీ అటెంప్ట్ చేస్తున్నారు షణ్ముఖ టీం. ఆది సాయి కుమార్, అవికా గోర్ లీడ్ రోల్ రోల్ లో షణ్ముగం సాప్పని ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నారు.

షణ్ముఖ ఒక డివోషనల్ థ్రిల్లర్ సబ్జెక్ట్ తో వస్తుంది. పవర్ ఫుల్ టైటిల్ తో వస్తున్న ఈ సినిమాను శాసనసభ అనే మూవీతో ప్రేక్షకులను అలరించిన సాప్ బ్రో ప్రొడక్షన్స్ లో ఈ సినిమా తెరకెక్కిస్తున్నారు. సాప్పని బ్రదర్స్ సమర్పణలో తులసీరాం సాప్పని, షణ్ముగం సాప్పని ఈ సినిమాను నిర్మిస్తున్నారు. సినిమా షూటింగ్ పూర్తి కాగా నిర్మాణాంతర కార్యక్రమాలను జరుపుకుంటున్న ఈ సినిమాను దీపావళి కానుకగా రిలీజ్ చేయాలని ఫిక్స్ అయ్యారు. అందుకు సంబంధించిన పోస్టర్ ని రిలీజ్ చేశారు మేకర్స్.

షణ్ముఖం సినిమాలో ఆది పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపిస్తున్నారు. పోస్టర్ ఇంప్రెసివ్ గా ఉంది. సినిమా గురించి దర్శకుడు మాట్లాడుతూ.. ఇప్పటివరకు ఎన్నో సినిమాలు వచ్చాయి కానీ ఎవరూ టచ్ చేయని సబ్జెక్ట్ తో షణ్ముఖం వస్తుందని అన్నారు. విజువల్ వండర్ గా.. అద్భుతమైన గ్రాఫిక్స్ తో ఈ సినిమా తెరకెక్కిస్తున్నామని చెప్పారు. డివోషనల్ థ్రిల్లర్ గా రాబోతున్న ఈ సినిమాలో ప్రతి పాత్ర హైలెట్ గా ఉంటుందని అన్నారు దర్శకుడు షణ్ముగం.

షణ్ముఖం సినిమాను దీపావళి కానుకగా పాన్ ఇండియా రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. ఫ్యామిలీ అంతా చూడదగ్గ డివోషనల్ థ్రిల్లర్ గా ఈ సినిమా వస్తుంది. కె.జి.ఎఫ్, సలార్ సినిమాలకు మ్యూజిక్ అందించిన రవి బసూర్ ఈ మూవీకి మ్యూజిక్ అందించారు. విజువల్ ఎఫెక్ట్స్, గ్రాఫిక్స్ విషయంలో స్పెషల్ కేర్ తీసుకున్నామని. ఓ అద్భుతమైన సినిమా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నామని తప్పకుండా ఈ షణ్ముఖం ఆది కెరీర్ లో మైలురాయిగా నిలిచిపోతుందని అన్నారు.

కొన్నాళ్లుగా సరైన సక్సెస్ లేక కెరీర్ లో వెనకపడ్డ ఆది షణ్ముఖంతో సత్తా చాటుతాడేమో చూడాలి.

Tags:    

Similar News