చీరందంలో సొగ‌సు చూడ‌త‌ర‌మా!

జైపూర్ బ్యూటీ ఆకాంక్ష సింగ్ సుప‌రిచిత‌మే. 'మ‌ళ్లీరావే' సినిమాతో ప‌రిచ‌య‌మైన అమ్మ‌డు తొలి సినిమాతోనే మెప్పించింది

Update: 2023-11-19 13:30 GMT

జైపూర్ బ్యూటీ ఆకాంక్ష సింగ్ సుప‌రిచిత‌మే. 'మ‌ళ్లీరావే' సినిమాతో ప‌రిచ‌య‌మైన అమ్మ‌డు తొలి సినిమాతోనే మెప్పించింది. నేచుర‌ల్ పెర్పార్మెన్స్ తో ఆక‌ట్టుకుంది. ఆకాంక్ష సినిమాకి అద‌న‌పు అస్సెట్ గా నిలిచింది. ఆ ప్ర‌తిభ‌తోనే కింగ్ నాగార్జున తో 'దేవ‌దాస్' లోనూ తెర‌ను పంచుకుంది. కానీ టాలీవుడ్ సొగ‌స‌రి కెరీర్ మాత్రం ఆశించిన విధంగా సాగ‌లేదు. హీరోయిన్ గా రాణిస్తుంది అన్న అంచ‌నాలు త‌ప్పాయి.


దీంతో బాలీవుడ్ సినిమాల‌పై ఫోక‌స్ పెట్టింది. అక్క‌డా నాలుగైదు సినిమాలు చేసింది. చివ‌రిగా 'ర‌న్ వే 34' లో న‌టించింది. కానీ ఆ సినిమా ఫ‌లితంలో మ‌రో అవ‌కాశానికి ఛాన్స్ ఇవ్వ‌లేదు. గ‌తేడాది నుంచి బ్యూటీ ఖాళీగానే ఉంటుంది. అవ‌కాశాల కోసం సీరియ‌స్ ప్ర‌య‌త్నాలు చేస్తున్నా ఫ‌లించ‌డం లేదు. కోలీవుడ్ లో నూ మెరిసింది. అక్క‌డా అదే ప‌రిస్థితి. న‌వ‌త‌రం నాయిక‌ల పోటీని త‌ట్టుకుని ఆకాంక్ష మార్కెట్ లో నిల‌బ‌డ లేక‌పోతుంది.


ఆకాంక్ష సోష‌ల్ మీడియాలో మ‌రీ అంత యాక్టివ్ కాదు. కానీ నెట్టింట‌కి ఎక్కిందంటే అందాల దాడి మాత్రం త‌ప్ప‌దు. అందం..చందాల‌తో యువ‌త‌ని క‌వ్వించడంలో మందుంటుంది. డిజైన‌ర్ దుస్తుల్లో ..చిట్టి పొట్టి నిక్క‌ర్ల‌లో ఆక‌ర్షిస్తుంది. ఆల్ట్రామోడ్ర‌న్ బ్యూటీగా ఫోక‌స్ అవుతుంది. తాజాగా అమ్మ‌డు ట్రెడీష‌న‌ల్ గాళ్ల్ గా మారిపోయింది. చీరందంతో స‌య్యాట‌కు తెర తీసింది. ఇదిగో ఇక్క‌డిలా సొగ‌సైన చీరందంలో కుర్రాళ్ల‌కు క‌వ్వించేస్తుంది.

మ్యాచింగ్ షోల్డ‌ర్ లెస్ ర‌విక ధ‌రించి సంథింగ్ స్పెష‌ల్ గా ఫోక‌స్ అవుతుంది. అమ్మ‌డి అలంక‌ర‌ణ చూప‌రుల‌ను ఆక‌ట్టుకుంటుంది. సారీపై ఎంపిక చేసుకున్న యాక్స‌రీస్ బ్యూటీని మ‌రింత అందంగా మ‌లిచాయి. వివిధ భంగిమ‌ల్లో ఆకాంక్ష భంగిమ‌లు యువ‌త‌లో హాట్ టాపిక్ గా మారాయి. స్టెప్స్ పై వ‌య్యారంగా కూర్చుని...ధార‌ళంగా న‌డుం అందాల్ని ఆర‌బోసిన వైనం ఆకాంక్ష‌లో సంథింగ్ ని ప‌రిచ‌యం చేస్తుంది. ప్ర‌స్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైర‌ల్ అవుతుంది. అభిమానులు త‌మదైన శైలిలో కామెంట్లు పోస్ట్ చేస్తున్నారు.

Tags:    

Similar News